YouTube: దేశంలో ప్రస్తుతం యూట్యూబ్ హవా కొనసాగుతోంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్న చందంగా తెలివి ఉన్న వాడు ఊరుకే కూర్చోడు. తనకు కావాల్సిన దాన్ని సంపాదించుకుని తీరుతాడు. ప్రస్తుతం యూ ట్యూబ్ కూడా అదే దారిలో నడుస్తోంది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. కంటెంట్ రైటర్లు, వీడియో అప్ లోడర్స్, షాట్ ఫిలిమ్స్ ఒకటేమిటి ప్రతి విభాగంలో డబ్బులు రావడంతో అందరు యూట్యూబ్ ను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని ఓ వ్యక్తి ఏకంగా ఏటా రూ.312 కోట్లు సంపాదించడం గమనార్హం. ఇలా యూ ట్యూబ్ కు డిమాండ్ పెరుగుతోంది. ఆ మధ్య చత్తీస్ గడ్ రాష్ట్రంలోని ఓ ఊరిలో దాదాపు అందరు యూట్యూబ్ అప్ లోడర్లే ఉండటం కూడా విచిత్రమే.

యూట్యూబ్ ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకుల ఆరదణ పొందుతున్నారు. డబ్బు కూడా సంపాదిస్తున్నారు. దీంతో వారి ఆదాయం రెట్టింపవుతోంది. ఇంకా ఇటీవల యూట్యూబ్ మధ్యలో ప్రకటనలు కూడా వేస్తుండటంతో వాటికి కూడా డబ్బు వస్తోంది. ఇలా రెవెన్యూ రావడంతో అందరు యూ ట్యూబ్ పై ఆధారపడి జీవిస్తున్నారు. వారికి బతుకు దెరువు, వినోదం రెండు కలిసి వస్తున్నాయి. దీంతో వారి భవిష్యత్ కు ఢోకా లేకుండా పోతోంది. దేశంలో ప్రస్తుతం ఏడు లక్షల మంది యూట్యూబ్ ను నమ్ముకుని బతుకుతున్నారంటే అది ఎంతటి ప్రాధాన్యం సంతరించుకుంటోందో తెలుస్తోంది.
దేశంలోని అన్ని భాషల్లో వీడియోలు చేస్తుండటంతో వారికి ఆదాయం కూడా భారీగానే ముడుతోంది. కంటెంట్ క్రియేటర్లు, యూజర్లకు యూట్యూబ్ ప్లాట్ ఫామ్ ఇస్తోంది. కంటెంట్ ప్రొవైడర్లకు మంచి స్థానం ఉండటంతో కొత్తవారు వస్తున్నారు. దేశ జీడీపీకి యూట్యూబ్ ద్వారా రూ.6800 కోట్ల ఆదాయం వస్తుందంటే యూట్యూబ్ ను నమ్ముకుని ఎంత మంది ఆధారపడుతున్నారో అర్థమవుతోంది. ఇలా దేశ ప్రజలకు యూ ట్యూబ్ ఓ వరంలా మారుతోంది. వస్తున్న ఆదాయంతో వారి జీవన స్థితిగతులు కూడా మెరుగవుతున్నాయి.

అన్ని రంగాల్లో యూ ట్యూబ్ లో వీడియోలు పోస్టు చేస్తున్నారు. వినోదం, ఫుడ్స్, ఆటో మొబైల్, సారీస్, హౌస్ డెకరేషన్స్, ట్రావెల్ తో పాటు అన్ని రంగాల్లో వీడియోలు తయారు చేసి యూ ట్యూబ్ లో పోస్టు చేస్తున్నారు. దీంతో వాటికి వచ్చిన వ్యూస్ ఆధారంగా మనకు డబ్బులు చెల్లిస్తున్నారు దీంతో ప్రతి వారు ఏదో ఒక వీడియో చేస్తూ అందరిని తమ వెంట తిప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా వీడియోల ద్వారా లక్షలాది రూపాయాలు సంపాదిస్తూ సులభంగా డబ్బు సంపాదించేందుకు నిర్ణయించుకుంటున్నారు.