Scholarship: ఒకప్పుడు చదువుకోవడానికి సౌకర్యాలు లేవు. పైగా చాలా మందికి చదువు గురించి పూర్తిగా అవగాహన లేకపోవడంతో మధ్యలోనే చదువును మానేశారు. కానీ నేటి కాలంలో ఆర్థికంగా లేకుండా చదువును కొనసాగించడానికి అనేక మార్గాలున్నాయి. చదువును కొనసాగించడానికి కొందరు ఆర్థిక వేత్తలు సాయం చేస్తుండగా.. కొన్ని సంస్థలు స్కాలర్ షిప్ ల పేరిట ఆర్థిక సాయం చేస్తున్నాయి. దేశంలో ఉత్తరాలను సరఫరా చేసే పోస్టాఫీసు ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు రకరకాల స్కీంల ను ముందుకు తీసుకొస్తుంది. తాజాగా విద్యార్థుల కోసం ఓ బృహత్తర పథకాన్ని తీసుకొచ్చింది. అదే స్టూడెంట్ స్కాలర్ షిప్.
ఇండియిన్ పోస్టాఫీసు ఆధ్వర్యంలో విద్యార్థులకు రూ.6000 స్కాలర్ షిప్ ను అందజేయనున్నారు. అయితే ఇవి పాఠశాలల్లో చదివే వారికి మాత్రమే. ఏదైనా గుర్తింపు పొందని పాఠశాలలో చదువున్న విద్యార్థితో పాటు స్టాంప్ కలెక్షన్ల హాబీ ఉండాలి. అయితే స్టాంప్ కలెక్షన్ల హాబీ లేకపోతే సొంత తపాలను కలిగి ఉండడానికి పాఠశాల నుంచి అనుమతి తీసుకోవాలి. ఇలాంటి వారికి ఇండియన్ పోస్టాఫీసు ప్రత్యేకంగా రూ.6000 స్కాలర్ షిప్ అందిస్తోంది. మరి దీనిని ఎలా అప్లై చేయాలంటే?
ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకునే విద్యార్థి ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉండాలి. పాఠశాలలో ఫిలాటెలిక్ క్లబ్ లేదా విద్యార్థి క్లబ్ లో సభ్యుడై ఉండాలి. విద్యార్థి అకాడమిక్ బాగుండాలి. విద్యార్థి రీసెంట్ గా రాసిన పరీక్షలో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అలాగే విద్యార్థులు సొంతంగా బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డును కలిగి ఉండాలి. నివాస సర్టిఫికెట్ కూడా అవసరం ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.indiapost.gov.in అనే వెబ్ సైట్ లో కి వెళ్లాలని సంబంధిత అధికారులు తెలిపారు.