https://oktelugu.com/

WhatsApp: వాట్సాప్ లో ఆ మెసేజ్ పెడితే లక్షల్లో జరిమానా.. జైలుకు.. జాగ్రత్త..

సౌదీ అరేబియా, కువైట్ దేశాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ కొన్ని చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కొన్ని చిన్నచిన్న తప్పులకు ఏకంగా ఉరిశిక్షలే ఉంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : August 4, 2023 / 11:17 AM IST

    WhatsApp

    Follow us on

    WhatsApp: మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. మెసేజ్ లతో పాటు ఫైల్స్ పంపించుకోవడానికి వాట్సాప్ సులువుగా ఉంటుంది. అందుకే కోట్ల మంది మొబైల్ వినియోగదారులు దీనికి అడిక్ట్ అయిపోయారు. తెల్లారి లేచిన దగ్గర్నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఈ యాప్ ను వాడని వారు లేరు. అయితే కొందరు వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్ లు, వీడియోలను వైరల్ చేస్తుంటారు. ఇదే సమయంలో కొందరు అమ్మాయిలకు సంబంధించిన బ్యాడ్ వీడియోలు, మెసేజ్ లు పెడుతూ ఉంటారు. ఇలా ఓ రకమైన మెసేజ్ పెట్టిన వారిపై కోర్టులో ఫిర్యాదు చేస్తే లక్షల రూపాయల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. ఆ వివరాలేంటంటే..

    సౌదీ అరేబియా, కువైట్ దేశాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ కొన్ని చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కొన్ని చిన్నచిన్న తప్పులకు ఏకంగా ఉరిశిక్షలే ఉంటాయి.అందుకే చాలా మంది ఇక్కడ జాగ్రత్తగా జీవిస్తారు. ఇక అమ్మాయిల విషయంలో మరీ కఠినంగా ఉంటారు. వారనిఏడిపించినా, వారితో అసభ్యంగా ప్రవర్తించినా శిక్షలు, జరినమాలు దారుణంగా ఉంటాయి. అయితే అమ్మాయిల విషయంలో కొందరు ఉత్సాహంగా ఏదీ పడితే అవే మెసేజ్ లు పెడుతూ ఉంటారు.

    అమ్మాయిలను అసభ్యంగా నిందిస్తూ.. లేదా వారిని లవ్ చేస్తున్నట్లు ఏమోజీలు పెట్టినా ఇక్క భారీ శిక్ష విధిస్తారు. ఇలా చేసినందుకు కువైట్ దేశంలో రెండేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అంతటితో వదలకుండా 2000 రూపాయల కువైట్ దానర్ల ఫైన్ వేస్తారు. ఇవి మన ఇండియన్ ప్రకారం రూస్తే రూ.5,35,825 లక్షల రూపాయలు. అదే సౌదీ అరేబియా దేశంలో 2 నుంచి 5 ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. శిక్షతో పాటు లక్ష సౌది రియాలు జరిమానా వేస్తారు. అంటే 22 లక్షల రూపాయలకు పై మాటే అన్నమాట.

    మనదేశంలో కొందరు నచ్చని వారు మెసేజ్ చేస్త వదిలేస్తాం.. అలా అని పదే పదే మెసేజ్ లు చేస్తే వారిని బ్లాక్ చేస్తాం. కానీ ఇలా మెసేజ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని అమ్మాయి కాంప్లయింట్ చేస్తే ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే యాక్షన్ తీసుకుంటుంది. కేసు తీవ్రంగా ఉంటే ఇంకాస్త కఠినంగా కూడా విధించే అవకాశం ఉంది. అందువల్ల సౌదీ, కువైట్ లకు చెందిన అమ్మాయిలకు మెసేజ్ పంపించే టప్పుడు జాగ్రత్తగా ఉండండి… అని కొందరు సూచిస్తున్నారు.