https://oktelugu.com/

Wedding business : రెడీమేడ్ కాలం.. కళ్యాణం కాస్ట్లీ.. రఫ్ గా 5.5 లక్షల కోట్ల వ్యాపారం

అప్పటి సీజన్ తో పోలిస్తే 1.25 లక్షల కోట్ల వ్యాపారం ఇప్పుడు అదనంగా జరుగుతుందనే అంచనా వేస్తున్నామని" బాడీ క్యాట్ చీఫ్ ఆఫీసర్ సుమిత్ అగర్వాల్ వివరించారు.

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2024 12:42 pm
    Follow us on

    Wedding business : “బంగారం కొనకుండా.. పొలాలు అమ్మకుండా.. పెళ్లిళ్లు ఎలా అవుతాయే?” అతడు సినిమాలో ఓ డైలాగు ఇది. ఇది కేవలం సినిమా డైలాగు మాత్రమే కాదు.. నిజ జీవితంలో జరుగుతున్న దానికి సరిగ్గా వర్తిస్తుంది. ఇంటిముందు పెళ్లి జరగడం లేదు. ఎవరూ చేసుకోవడం లేదు కూడా.. అంతా ఫంక్షన్ హాల్ లోనే. నిశ్చయ తాంబూలం నుంచి పరిణయం వరకు ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే.” అందుకే పెళ్లంటే నూరేళ్లపంట.. దానికి ముందు పెళ్లంటే పెట్టినంత ఖర్చు. తిన్నంత భోజనం.” శూన్య మాసాలు ముగిసిన నేపథ్యంలో ముహూర్తాల కాలం ప్రారంభమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 42 లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని ఒక అంచనా. ఢిల్లీలోనే నాలుగు లక్షల పై వివాహాలు జరుగుతాయని సమాచారం. ఈ వివాహ వేడుకలకు 5.5 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని వర్తకులు అంచనా వేస్తున్నారు.

    పెళ్లంటే దుస్తులు, ఆభరణాలు తప్పనిసరి. ఇంకా ఆర్థికంగా స్థితిమంతమైన కుటుంబాలు వాహనాలు కూడా కొనుగోలు చేస్తాయి. పెళ్లిలో వీటి తర్వాత అత్యధిక డిమాండ్ ఉండేది భోజనాలకు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు వంటలకు సంబంధించి వాడే నిత్యావసర సరుకులకు డిమాండ్ విపరీతంగా ఉంది. ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో నిత్యావసరాల ధరలు పెరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత సీజన్ నుంచి జూలై 15 వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో దాదాపు 42 లక్షల వరకు వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ వివాహాల నేపథ్యంలో 5.5 లక్షల కోట్ల వరకు మార్కెట్లో వివిధ రకాల వస్తువుల కొనుగోలు జరిగే అవకాశం ఉంది.

    ” వివాహ సంబంధిత వస్తువుల కొనుగోలు కోసం భారీగా నగదు ఖర్చు చేస్తారు. దీనివల్ల ఎక్కువ మొత్తంలో నగదు మార్కెట్లోకి ప్రవేశిస్తుంది. ఆర్థికంగా బాగా ఉన్నవారు డెస్టినేషన్ వెడ్డింగ్స్ ను ఇతర దేశాల్లో కాకుండా మనదేశంలోని వివిధ ప్రాంతాల్లో చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆ పిలుపు కూడా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.. దీంతో వివిధ రాష్ట్రాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగే వేదికలు జూలై వరకు పూర్తిగా బుక్ అయ్యాయి. గత ఏడాది డిసెంబర్ 14 తో దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ముగిసింది. 35 లక్షల వరకు పెళ్లిళ్లు జరిగాయి. వాటి ఆధారంగా 4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. అప్పటి సీజన్ తో పోలిస్తే 1.25 లక్షల కోట్ల వ్యాపారం ఇప్పుడు అదనంగా జరుగుతుందనే అంచనా వేస్తున్నామని” బాడీ క్యాట్ చీఫ్ ఆఫీసర్ సుమిత్ అగర్వాల్ వివరించారు.