https://oktelugu.com/

Entrepreneur : వారానికి 30 గంటలు పనిచేస్తూ 2.15 కోట్లు సంపాదిస్తున్న 24 ఏళ్ల వ్యక్తి.. ఎలాగంటే?

ఇదిలా ఉంటే అతను సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు ఆరు గంటలు లేదా వారానికి 30 గంటలు పని చేస్తాడట. తన క్లయింట్లు, వారి ఉత్పత్తులపై మార్కెట్ రీసెర్చ్ చేయడానికి దాదాపు 40% సమయాన్ని వెచ్చిస్తాడట.

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2024 / 08:06 PM IST
    Follow us on

    Entrepreneur : తెలివి, అదృష్టం, పని ఉండాలి కానీ డబ్బు సంపాదించడం చాలా సులభం. ఓ వ్యక్తి గురించి తెలుసుకుంటే ఇదే నిజం అనిపిస్తుంది. మరి తానెవరో తెలుసుకుందాం. స్టీవెన్ గువో అనే వ్యక్తి యునైటెడ్ స్టేట్స్ నుంచి బాలికి వెళ్లారట. అక్కడ వారానికి 30 గంటలు మాత్రమే పని చేస్తున్నాడు. కానీ సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నాడో తెలిసా? ఏకంగా ఈయన సంవత్సరానికి $254,000 (₹2.15 కోట్లు) సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు. ఇక ఈయన వయసు తెలుసా? కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. ఈ వ్యాపారవేత్త రీసెంట్ గా కొన్ని విషయాలు పంచుకున్నాడు. మరి అవేంటో చూసేద్దామా?

    పని-జీవిత సమతుల్యత కోసం తాను US నుంచి దూరంగా వెళ్లాడట. ఈయన వెళ్లిన ప్రాంతం ఏదో కాదు బాలీ. తన పని-జీవిత సమతుల్యతను గుర్తించిన ప్రదేశం బాలీ అన్నారు స్టీవెన్. ఉదయం పూట ఎక్కువగా తన వ్యాపారాన్ని చూసుకునేవాడట. మధ్యాహ్నాలు సర్ఫింగ్, ప్రకృతి దృశ్యాలను అన్వేషించేవాడట. అయితే ఈయన గేమ్ ఆడటానికి Minecraft సర్వర్‌లను హోస్ట్ చేశాడట. వ్యవస్థాపక జర్నీని 12 కి ప్రారంభించినట్లు చెప్తే ఈయనను చూసి “ఇతరులు కూడా దీన్ని ఆడటం ప్రారంభించారట. దీని కోసం చాలా మంది ఆయనకు $50 ఇచ్చేవారట. ఇలా గేమ్ ఆడుతూ కూడా డబ్బు సంపాదించవచ్చు అది కూడా ఇంటర్నెట్ లో అని ఆయన ముందు ఊహించలేదట. కానీ ఇప్పుడు ఈ ప్రయత్నం అతనికి $10,000 సంపాదించింది.

    కొన్ని నెలల తర్వాత వీడియో గేమ్‌ల పట్ల అతనికి ఉన్న అభిరుచిని అన్వేషించడానికి, అతను గేమ్ డెవలప్‌మెంట్ కంపెనీని ప్రారంభించాలని ప్రయత్నించాడు, కానీ అనుకున్నట్టు సక్సెస్ కాలేదు. డబ్బు మొత్తాన్ని కూడా పోగొట్టుకున్నాడుట. కానీ దీని ద్వారా ఓ పెద్ద గుణ పాఠం నేర్చుకున్నాడు. ముందుగా ముఖ్యంగా ఏ వ్యాపారం చేయాలన్నా కూడా మార్కెటింగ్ చాలా అవసరం అన్నాడు స్టీవెన్. అంతేకాదు ఈయనకు వచ్చిన ఈ అనుభవం వ్యాపారాన్ని అతనికి నిమగ్నతను కలిగించింది. ఈయన యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో బిజినెస్ ఎకనామిక్స్‌ పూర్తి చేశాడు. అయితే తన వ్యవస్థాపక వ్యాపారాలపై ఎక్కువ దృష్టి పెట్టాడు. 2.7 GPA స్కోర్ చేశాడు.

    ఈ స్కోర్ తో ఉద్యోగం చేయడం, ఉద్యోగం పొందడం చాలా కష్టం అనుకున్నాడట. అందుకే బిజినెస్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడట. ఆ సంకల్పం ఈ రోజు ఆయనను US అంతటా 19 మంది ఉద్యోగుల-కంపెనీని నడుపేలా నిలబెట్టింది. ఫిలిప్పీన్స్, UK భారతదేశంలో కూడా ఈయన కంపెనీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే అతను సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు ఆరు గంటలు లేదా వారానికి 30 గంటలు పని చేస్తాడట. తన క్లయింట్లు, వారి ఉత్పత్తులపై మార్కెట్ రీసెర్చ్ చేయడానికి దాదాపు 40% సమయాన్ని వెచ్చిస్తాడట.

    అతని విజయవంతమైన వ్యాపారాలలో ఆన్‌లైన్ రిటైలర్, K-పాప్-ప్రేరేపిత వాణిజ్య దుకాణం, లగ్జరీ కార్ల కోసం ప్రీమియం కార్ కవర్‌లను విక్రయించే కంపెనీలు ఉన్నాయట. అయితే 24 ఏళ్ల అతను డబ్బుపై దృష్టి పెట్టడమే కాకుండా, బాలిలో స్థిరపడటానికి ముందు 15 దేశాలు తిరిగి చాలా విషయాలు నేర్చుకున్నాడట. ఇవన్నీ తన బిజినెస్ కు సహాయం చేశాయట.