Yuvraj Singh-MS Dhoni
Yuvraj Singh : : నూటికో, కోటికో పై ఉపోద్ఘాతానికి తగ్గట్టుగా జీవిస్తున్నారు.. అలాంటివారిలో టీమిండియా ఒకప్పటి స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్( Yuvraj Singh) ఒకడు. మైదానంలో దూకుడుగా ఉంటాడు. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టేంత కసితో ఉంటాడు. రక్తం కక్కుకొని ఇబ్బంది పడుతున్నప్పటికీ దేశం కోసం ఆడుతుంటాడు. అందువల్లే యువరాజ్ సింగ్ అంటే భారతీయులు చెవి కోసుకుంటారు. ముఖ్యంగా అతడి హయాంలో క్రికెట్ చూసినవాళ్లు బట్టలు చించుకుంటారు. ఎంతో సామర్థ్యం ఉన్నప్పటికీ.. మరెంతో ప్రతిభ ఉన్నప్పటికీ. కెప్టెన్ కావాల్సినవాడు అంతర్గత రాజకీయాల వల్ల అర్ధాంతరంగా తన కెరియర్ కు ముగింపు పలికాడు.. తన కొడుకుకు జరిగిన అన్యాయంపై యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ అనేక వేదికలపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పటికీ.. భారత జట్టు నాటి కెప్టెన్ ధోనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినప్పటికీ యువరాజ్ సింగ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక్క పలుకు కూడా నాటి ఆటగాళ్లకు వ్యతిరేకంగా పలకలేదు. ఇప్పటికీ అదే స్థిర చిత్తాన్ని యువరాజ్ సింగ్ ప్రదర్శిస్తున్నాడు.
ఓపెన్ గానే చెప్పేసాడు
సినిమా ఇండస్ట్రీ మాదిరిగానే క్రికెట్ లోనూ వ్యక్తి పూజ అధికంగా ఉంటుంది. వ్యక్తి భజన తారస్థాయిలో ఉంటుంది. అయితే కొంతమంది అవకాశాల కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో సక్సెస్ అవుతూ ఉంటారు. కానీ ఏనాడు కూడా యువరాజ్ సింగ్ అలాంటి పని చేయలేదు. అలాంటి పని చేయలేనని కూడా చెప్పేశాడు. అందువల్లే జట్టుకు దూరంగా ఉన్నప్పుడు బాధపడలేదు. జట్టులో అవకాశాలు వచ్చినప్పుడు ఎగిరి గంతులు వేయలేదు. జట్టు విజయాలలో తన వంతు పాత్ర పోషించినప్పటికీ చొక్కా విప్పి ఎగరలేదు. మైదానంలో దూకుడు చూపించాడు. తెగువను ప్రదర్శించాడు. తనను గెలికితే ఎలా ఉంటుందో ప్రత్యర్థి బౌలర్లకు రుచి చూపించాడు. అందువల్లే సింహ స్వప్నం లాగా మిగిలిపోయాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికినప్పటికీ.. యువరాజ్ సింగ్ తగ్గలేదు. తగ్గే అవకాశం కూడా లేదు. అదే టెంపర్ మెంట్.. అదే అగ్రెసివ్ నెస్. ఓ యూట్యూబర్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన అడిగిన ప్రశ్నలకు యువరాజ్ మొహమాటం లేకుండా సమాధానం చెప్పాడు. మీ ఫ్రెండ్స్ ఎవరంటే భజ్జి (హర్భజన్ సింగ్), ఆశీష్ నెహ్రా, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్ పేర్లు మాత్రమే చెప్పాడు. అంతేతప్ప ధోని అని ఎక్కడా వ్యాఖ్యానించలేదు. ధోని పేరు చెబుతాడేమోనని ఆ యూట్యూబర్ ఆసక్తిగా చూశాడు. కానీ అతడి ఆసక్తి కోసం యువరాజ్ అబద్ధం చెప్పలేదు. చెప్పడు కూడా. ఎందుకంటే అతడు పంజాబ్ డైనమైట్ కాబట్టి.. క్యాన్సర్ నే గెలిచినవాడు.. కాంప్రమైజ్ అయి బతకలేడు కాబట్టి.. ఎందుకంటే అతడికి జీవితం వడ్డించిన విస్తరి కావచ్చు.. కానీ దాన్ని రక్తం కక్కి మరి బాగు చేస్తున్నవాడు.. ఆ మాత్రం టెంపర్ మెంట్ చూపించకపోతే ఎలా.. ” యువరాజ్ అంటే టీమ్ ఇండియా డైనమైట్. క్యాన్సర్ వ్యాధినే జయించిన ధీరుడు. అటువంటి వ్యక్తి ధోని పేరు చెప్పాడని నువ్వెలా ఊహించావు రా బాబూ” అంటూ ఆ యూట్యూబర్ ను యువరాజ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.