Anvesh YouTuber : ఒకప్పుడు ప్రపంచం లోని అన్ని దేశాల్లో పర్యటిస్తూ, ఎన్నో గొప్ప విశేషాలను, వివిధ దేశాలకు సంబంధించిన నాగరికతను, అక్కడి ప్రజల విధి విధానాలు, అద్భుతమైన లొకేషన్లు చూపిస్తూ అశేష ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న అన్వేష్, ఇప్పుడు మతి స్థిమితం కోల్పోయిన వాడిలాగా ప్రవరుస్తున్నాడు అంటూ ఆయన అభిమానులే మండిపడుతున్నారు. నటుడు శివాజీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం దగ్గర మొదలైన ఈ వివాదం, హిందీ దేవుళ్ళ దగ్గర వరకు వచ్చి చేరింది. ఇక్కడ దాకా వస్తే జనాలు ఊరుకుంటారా చెప్పండి?, ఎక్కడో విదేశాల్లో కూర్చొని మాట్లాడడం కాదు, దమ్ముంటే ఇండియా కి వచ్చి మాట్లాడు, నీ బొక్కలు విరగొట్టి పోలీసులకు అప్పగిస్తామంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనాల నుండి ఇంతటి వ్యతిరేకత ఎదురుకున్న తర్వాత ఏ మనిషి అయినా మారుతాడు, లేదంటే అజ్ఞాతం లోకి వెళ్తాడు.
కానీ అన్వేష్ మాత్రం ప్రతీ రోజు ఎదో ఒక వీడియో ని విడుదల చేసి ఎవరినో ఒకరిని రెచ్చగొడుతూనే ఉన్నాడు. రీసెంట్ గానే ఆయన ఇకమీదట నేను మన ఇండియన్ ప్రబుత్వానికి టాక్సులు కట్టనని, నేను సంపాదించిన డబ్బులు కూడా దానధర్మాలు చేయబోనని, ఇలా ఎన్నో రకాల మాటలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మరో షాకింగ్ వీడియో ని విడుదల చేస్తూ ‘ఇప్పటి వరకు నేను 130 దేశాలు తిరిగాను, వాటి ద్వారా నేను ఎంతో సంపాదించాను. ప్రస్తుతం నా వద్ద 8 కోట్ల రూపాయిలు ఉన్నాయి. వాటితో మిగిలిన దేశాలు తిరుగుతాను కానీ, వాటి మీద వీడియోలు మాత్రం చెయ్యను. అవి కేవలం నా వ్యక్తిగత పర్యటనలు మాత్రమే. ఇక మీదట నేను నా యూట్యూబ్ చానెల్స్ ని ప్రజా పోరాటం కోసం ఉపయోగిస్తాను. సమస్యలపై పోరాడుతాను’ అంటూ చెప్పుకొచ్చాడు అన్వేష్. ఇతన్ని మిలియన్ల సంఖ్యలో నెటిజెన్స్ అనుసరిస్తుంది కేవలం ఆయన ట్రావెలింగ్ వీడియోస్ చేస్తున్నాడు అనే కారణంతోనే, ఇప్పుడు అది వదిలేసి, నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసే వీడియోస్ ని మేమెందుకు ప్రోత్సహిస్తాము, ఇప్పుడు నిన్ను అన్ ఫాలో అవుతాము అంటూ నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు.
https://www.youtube.com/shorts/enmcu787JzI