Tongue colour : ప్రతి ఒక్కరూ అప్పడప్పుడు అనారోగ్యానికి గురవుతుంటా. అలాంటి సమయంలో వైద్యుల వద్దకు వెళ్లగానే సాధారణ పరీక్షల్లో భాగంగా, పల్స్, బీపీ చెక్‌చేస్తారు. తర్వాత కళ్లను బాగా తెరిచి చూస్తారు. తర్వాత నాలుక బయటపెట్టమని అంటారు. నాలుక బయట పెట్టగానే దానిని పరిశీలిస్తారు. ఈ నాలుక చూడడం వలన వ్యాధిని వైద్యులు గుర్తిస్తారట. అందుకే నాలుక చూపమని కోరతారు. అయితే.. నాలుక ఉండే రంగు ఆధారంగా వ్యాధి ప్రాథమిక లక్షణంగా భావిస్తారట. అందుకే డాక్టర్లు ఖచ్చితంగా నాలుక రంగును గమనిస్తారు. రంగు ఆధారంగా వ్యాధిని నిర్ధారిస్తారు. నాలుక రంగు మన అనారోగ్య సమస్యను తెలియజేస్తుంది. రంగు ద్వారా వ్యాధికి సంబంధించిన ఆధారాలు లభిస్తాయి. వెంటనే చికిత్స చేయించుకునే అవకాశం కలుగుతుంది. ఏరంగులో ఉంటే ఏ సమస్య ఉన్నట్లు అనే విషయం తెలుసుకుందాం.
తెల్లటి మచ్చలు.
నాలుకపై తెల్లని మచ్చలు ఉంటే.. ఇది ఈస్ట్ ఇన్‌ఫెక్షన్‌కు సంకేతం. ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లు తరచుగా చిన్న పిల్లలు లేదా వృద్ధుల్లో కనిపిస్తాయి. అలాగే డీహైడ్రేషన్, ల్యూకోప్లాకియా, నాలుక వ్యాధి వంటి సమస్యలు ఉన్నా.. నాలుక తెల్లగా ఉంటుంది. అయితే ఈ వ్యాధులు ప్రాణాంతకం కాదు.
పాలిపోయినట్లు..
మన నాలుక రంగు పాలిపోయినట్లు ఉంటే.. శరీరంలో రక్తం లోపిస్తుందని అర్థం. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. విటమిన్ బీ12 సమస్య ఉన్నట్లు సంకేతం. ఇలాంటి సమయంలో వైద్యులను సంప్రదించాలి.
పసుపు రంగు..
ఇక నాలుక పసుపు రంగులో ఉంటే.. కామెర్లు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది వాయధి ప్రారంభ సంకేతం. అయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే వ్యాధి ముదిరి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది.
నలుపు..
కొందరి నాలుకలు నల్లగా ఉంటాయి. ఇది తీమ్రైన హెచ్చరిక. నల్ల నాలుక గొంతు లేదా బ్యాక్టీరియా సంకమణకు సంకేతం. ఎక్కువ మందులు తీసుకోవడం వలన నాలుక నల్లబడుతుంది. డయాబెటిస్, క్యాన్సర్ ఉన్నవారి నాలుక కూడడా నల్లగా మారుతుంది. కడుపులో పుండ్లు ఉన్నా.. నాలుక నల్లబడుతోంది.