
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్-2 సరికొత్త విధానానికి ఐసీసీ ఆమోదముద్ర వేసింది. కొత్త పాయింట్ల పద్ధతిని ధ్రువీకరించింది. ఇకపై మ్యాచ్ గెలిస్తే 12, డ్రా అయితే 4, టై చేసుకుంటే 6 పాయింట్లు లభిస్తాయని తెలిపింది. ఇంగ్లాండ్, భారత్ ఐదు టెస్టుల సిరీసుతో రెండేళ్ల సైకిల్ మొదలవుతుంది. ఐసీసీ రెండు ఛాంపియన్ షిప్ లో ఎక్కువ సంఖ్యలో టెస్టులున్న సిరీసులు తక్కువగానే ఉన్నాయి. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సీరీసులు, భారత్, ఆసీస్, ఇంగ్లాండ్ ఆసీస్ మధ్య నాలుగు టెస్టుల సిరీసులే పెద్దవి. ఆ తర్వాత అన్ని సిరీసుల్లోనూ 3 అంతకన్నా తక్కువే ఉన్నాయి.