అలా చేయనందుకు చింతిస్తున్నా.. రతన్ టాటా

రతన్ టాటాకు ఆర్కిటెక్ట్ అవ్వాలని కోరిక ఉండేదట. కానీ ఆయన తండ్రి రతన్ ను ఇంజినీర్ ను చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్ కాలేజీలో కూడా చేర్పించారు. కానీ, రతన్ ఆర్కిటెక్చర్ పై ఆసక్తితో ఇంజినీరింగ్ కోర్సును వదిలేసి 1959లో న్యూయార్క్ లోని కొర్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ డిగ్రీలో చేరారు. ఓ ఆర్కిటెక్ట్ కంపెనీలో కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేశారు. కానీ విధి ఆయన్ను వ్యాపార రంగంలోకి నెట్టింది. తండ్రి నుంచి టాటా సంస్థ బాధ్యతలు తీసుకోవాల్సి […]

Written By: Velishala Suresh, Updated On : July 11, 2021 7:17 pm
Follow us on

రతన్ టాటాకు ఆర్కిటెక్ట్ అవ్వాలని కోరిక ఉండేదట. కానీ ఆయన తండ్రి రతన్ ను ఇంజినీర్ ను చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్ కాలేజీలో కూడా చేర్పించారు. కానీ, రతన్ ఆర్కిటెక్చర్ పై ఆసక్తితో ఇంజినీరింగ్ కోర్సును వదిలేసి 1959లో న్యూయార్క్ లోని కొర్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ డిగ్రీలో చేరారు. ఓ ఆర్కిటెక్ట్ కంపెనీలో కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేశారు. కానీ విధి ఆయన్ను వ్యాపార రంగంలోకి నెట్టింది. తండ్రి నుంచి టాటా సంస్థ బాధ్యతలు తీసుకోవాల్సి రావడంతో తనకిష్టమైన ఆర్కిటెక్ట్ వృత్తిని వదిలేశారు. ఆర్కిటెక్ట్ గా కొనసాగపోవడం పై చింతిస్తుంటానని రతన్ టాటా తెలిపారు.