
టీడీపీ అధినేత చంద్రబాబుతో మంగళగిరిలో ని ఎన్టీఆర్ భవన్ లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకర్గ ఎమ్మెల్యే, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ ముగిసింది. 40 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించిన చంద్రబాబు గోరంట్ల గౌరవానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.