
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మళ్లీ ప్రపంచ నంబర్ వన్ గా అవతరించాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రీలియా మాజీ సారథి స్టీవ్ స్మీత్ ను వెనక్కి నెట్టాడు. మరోవైపు టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఆరో స్థానానికి చేరుకున్నాడు. రిషబ్ పంత్ ఏడో ర్యాంకుకు పడిపోయాడు.