https://oktelugu.com/

Anushka : అనుష్క కి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదా మరి ఘాటి సినిమా ఎందుకు చేస్తుంది…?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు గ్లామర్ షో చేస్తూ అవకాశాలను దక్కించుకుంటూ ఉంటారు. ఇక మరి కొంతమంది మాత్రం వాళ్ల పర్ఫామెన్స్ తో భారీ ఇమేజ్ ను దక్కించుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను కూడా సంపాదించుకొని స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతారు... ఏది ఏమైనా కూడా వాళ్ళ ఇమేజ్ అనేది తారాస్థాయిలో ఉంటుందనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 9, 2024 / 08:04 AM IST

    Why is Anushka interested in movies or doing a more intense movie...?

    Follow us on

    Anushka : సూపర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ అనుష్క… ఈ సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకొని హీరోయిన్ గా కూడా ఎదిగింది. మరి ఇలాంటి సందర్భంలో అనుష్కతో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు సైతం ఉత్సాహాన్ని చూపించారు. ఇక దర్శకుల విషయం అయితే చెప్పనక్కర్లేదు. ఆమె హైట్ ఎక్కువ ఉండే హీరోలకు సరిగ్గా సరిపోతుంది. అలాగే తన నటనతో కూడా ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చింది. ఇక ఎప్పుడైతే కోడి రామకృష్ణ దర్శకత్వంలో అరుంధతి సినిమా చేసిందో అప్పటినుంచి ఆమె ఫేట్ మొత్తం మారిపోయిందనే చెప్పాలి. ఇక హీరోలకు సమానమైన క్రేజ్ ను సంపాదించుకుంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకైతే పెట్టింది పేరుగా మారింది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బాహుబలి’ సినిమాలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. దేవసేన క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించడమే కాకుండా ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకుంది. ఇక ఆ తర్వాత ‘సైజ్ జీరో’ సినిమా కోసం భారీగా లావైన ఆమె మళ్లీ సన్నబడడానికి చాలా కష్టతరంగా మారింది. దాంతో ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో మరోసారి ‘ఘాటి’ అనే సినిమా చేస్తుంది. ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు ‘వేదం’ అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే.

    ఇక ఈ సినిమాలో అనుష్క తన పర్ఫామెన్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా కొన్ని అవార్డులను కూడా గెలుచుకుంది. ఇక ఇప్పుడు మరోసారి వీళ్ళ కాంబినేషన్ లోనే మరో సినిమా రావడం అనేది ప్రేక్షకులందరిని ఆనందపడేలాచేస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా అనుష్కకి ఇప్పుడు సినిమాలు చేసే ఇంట్రెస్ట్ అయితే పెద్దగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

    ఎందుకంటే ఆమె చాలా లావైపోయింది ఇక హీరోయిన్ గా అవకాశాలు కూడా రావడం లేదు. కాబట్టి తను సినిమా ఇండస్ట్రీ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించాలని తద్వారా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి. కానీ క్రిష్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాని ఓకే చేసి ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

    మరి అతను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సక్సెస్ దక్కుతుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తే ఈ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందనే ఫీల్ అయితే కలుగుతుంది…