
నెల్లురు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందు వల్ల ఎటువంటి దుష్ర్పభావాలు లేవంటున్నారు.. దీంతో పాటు ఔషధాన్ని ఉచితంగా ఇస్తున్నప్పుడు అభ్యంతరం ఎందుకు అని చినజీయర్ స్వామి ప్రశ్నించారు. ఓ మందు ప్రాణాలు నిలబెడుతుంటే వివాదం ఎందుకు అన్నారు. సంక్షోభం వేళ వివాదాలకు తావివ్వకూడదు అని చెప్పారు. ఎర్రగడ్డలోని ఈఎస్ ఐ ఆస్పత్రిని స్వామిజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఒక వ్యక్తి చనిపోతుంటే ఆనందయ్య మందు ప్రాణం నిలబెడుతున్నప్పుడు ఎందుకు వివాదం అవుతోందని చినజీయర్ స్వామీ అన్నారు.