https://oktelugu.com/

Modi-Biden Meeting: మోదీ-బైడెన్ భేటీపై వైట్ హౌస్ కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ల మధ్య ఈనెల 24న జరిగే భేటీతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలోపేతమవుతుందని వైట్ హౌస్ అధికారులు పేర్కొన్నారు. క్వాడ్ గ్రూప్ జోరందుకునేందుకూ ఈ సమావేశం దోహదపడుతుందని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 24న వైట్ హౌస్ లో ఇరువురు నేతల తొలి భేటీకి బైడెన్ అతిధ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశం అనంతరం వైట్ హౌస్ లో జరిగే క్వాడ్ నేతల భేటీలో ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని […]

Written By: , Updated On : September 21, 2021 / 01:08 PM IST
Follow us on

ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ల మధ్య ఈనెల 24న జరిగే భేటీతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలోపేతమవుతుందని వైట్ హౌస్ అధికారులు పేర్కొన్నారు. క్వాడ్ గ్రూప్ జోరందుకునేందుకూ ఈ సమావేశం దోహదపడుతుందని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 24న వైట్ హౌస్ లో ఇరువురు నేతల తొలి భేటీకి బైడెన్ అతిధ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశం అనంతరం వైట్ హౌస్ లో జరిగే క్వాడ్ నేతల భేటీలో ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని యోషిహిదే సుగ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ షూరిసన్ లతో బైడన్ సంప్రదింపులు జరుపుతారు.

బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ, బైడెన్ లు పలుమార్లు ఫోన్ సంభాషణలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరిపారు. వీరిద్దరి మధ్య చివరిగా ఏప్రిల్ 26న ఫోన్ సంప్రదింపులు జరిగాయి. ఇక ముఖాముఖి భేటీలో బైడెన, మోదీ ఇరు దేశాల ప్రజల మద్య సంబంధాల బలోపేతానికి ఏడు దశాబ్దాలకు పైగా ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని మరింత పరిపుష్టం చేసే దిశగా చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.