
తన అభిప్రాయాలు తమ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయా? అని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు జరగకూడదు అనేది తమ పార్టీ నిర్ణయం కాదా అని నిలదీశారు. తనపై అనర్హత వేటుకు కారణం ఏమిటని ప్రశ్నించారు. ఎంపీ కనకమేడల తనను పరామర్శ కోసం మాత్రమే కలిశారన్నారు. తెలుగు భాషపై ఏపీ ప్రభుత్వం తీరు రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రఘురామ పేర్కొన్నారు.