Homeవార్త విశ్లేషణKalvakuntla  Kavitha :  తీహార్ జైల్లో కవిత భోజనం ఇదీ.. ఏం పెడుతున్నారంటే?

Kalvakuntla  Kavitha :  తీహార్ జైల్లో కవిత భోజనం ఇదీ.. ఏం పెడుతున్నారంటే?

Kalvakuntla  Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. అప్పటినుంచి ఆమె బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కోర్టు లో ఆమెకు చుక్కెదురవుతూనే ఉంది. ఆమెను అరెస్టు చేసిన తర్వాత ఈడీ కోర్టు ఆదేశాలతో వారం పాటు కస్టడీకి తీసుకుంది. ఆ తర్వాత కోర్టు అనుమతితో మరో మూడు రోజులు దానిని పొడగించింది. ఈ నేపథ్యంలో కవిత కోర్టును ఆశ్రయించారు. తన కొడుకుకి పరీక్షలు ఉన్న నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

దానికి సంబంధించి మంగళవారం కోర్టులో వాదనలు జరిగాయి. “కవిత పలుకుబడి కలిగిన వ్యక్తి. విచారణకు సరిగా సహకరించడం లేదు. ఇప్పటివరకు ఆమె కొన్ని విషయాలు చెప్పారు. ఇంకా చాలా విషయాలు రాబట్టాల్సి ఉంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కవితను కలిపి విచారించాల్సి ఉందని” ఈడీ అధికారుల తరపు న్యాయవాది కోర్టు ఎదుట వాదించడంతో.. న్యాయమూర్తి సమ్మతం తెలిపారు. కవిత రిమాండ్ 14 రోజులపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమె తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.. కవిత తీహార్ జైలుకు వెళ్లిన నేపథ్యంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

తీహార్ జైలు ఢిల్లీలోనే ఉన్నప్పటికీ.. తీహార్ అనే గ్రామంలో ఉన్నది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. మనదేశంలో పేరుపొందిన నాయకుల నుంచి కరడుగట్టిన నేరస్తుల వరకు తీహార్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. వాస్తవానికి 6,000 ఖైదీల సామర్థ్యంతో ఈ జైలు నిర్మించగా.. సామర్థ్యానికి మించి ఇందులో ఖైదీలు ఉంటారు.. వీవీఐపీ ఖైదీలను కూడా ఈ జైలుకే తరలిస్తారు.. అయితే వారికి పెట్టె భోజనం విషయంలో.. మాత్రం ఆ స్థాయి చూపించరు. ఒకవేళ అనారోగ్య సమస్యలు ఏవైనా ఎదుర్కొంటుంటే.. న్యాయమూర్తి ఆదేశాలతో ప్రత్యేకమైన ఆహారం తెప్పించుకునే వెసలు బాటు ఉంటుంది. అయితే ఆ ఆహారాన్ని జైల్లో ఉన్న డైటీషియన్ పరీక్షించిన తర్వాతే ఖైదీకి ఇస్తారు..

ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కవితకు పెట్టే భోజనం విషయంలో జైలు అధికారులు ప్రత్యేకమైన మెనూ అమలు చేయడం లేదు. ఆమెకు హైబీపీ ఉందని ఇటీవల ఆమె తరపు న్యాయవాదులు చెప్పినప్పటికీ.. భోజనం విషయంలో ఆమె కోర్టు నుంచి ప్రత్యేకమైన ఆదేశాలు తెచ్చుకున్నారు. దీంతో ఆమెకు ప్రతిరోజు ప్రత్యేకమైన భోజనం వస్తోంది. కాకపోతే ఆ భోజనాన్ని డైటీషియన్ పరీక్షిస్తున్నారు. ఇక తీహార్ జైల్లో ఖైదీలకు ఉదయం పూట చపాతీ లేదా రోటి.. దాంతోపాటు కూర ఇస్తారు. మధ్యాహ్నం అన్నం, రోటీ లేదా చపాతి, కూర, పెరుగు వడ్డిస్తారు. రాత్రి కూడా ఇదే మెనూ అమలు చేస్తారు. ఒకవేళ జైలు క్యాంటీన్లో ఏదైనా కొనుక్కోవాలి అంటే.. కచ్చితంగా జైలు ఆవరణలో పనిచేయాలి. చేసిన పని ఆధారంగా జైలు అధికారులు చెల్లించే డబ్బులతోనే అక్కడ ఏవైనా తినుబండారాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. బయటనుంచి నగదును ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version