
తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ హాజరయ్యారు. నైట్ కర్ఫ్యూ వల్ల కరోనా కేసులు తగ్గాయని ప్రభుత్వం పేర్కొనగా ఎక్కడ తగ్గాయో చూపించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. బార్లు థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. కుంభమేళాకు వెళ్లొచ్చిన వారిని ఇతర రాష్ట్రాలు క్వారంటైన్ లో పెడుతున్నాయి. తెలంగాణలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రశ్నించింది.