
తమ సంయమనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షించొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చల్ రాజ్ భవన్ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడం, పలువురు నేతలను ముందుస్తుగా నిర్భందిచడం పై రేవండ్ మాట్లాడారు. ముందస్తూ అరెస్టులు, నిర్భందాలు చేస్తే చూస్తూ ఊరుకోం. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. ఎంతమందిని అరెస్టు చేసినా నిరసన కార్యక్రమం చేపట్టి తీరుతాం అని రేవంత్ స్పష్టం చేశారు.