టాలీవుడ్ లో ‘మా’ ఎన్నికల బాగోతం పై ఇప్పటికే వేడి రేగుతూ చల్లారుతూ ఉంది. నిన్న ఈ వేడిలో వేలు పెట్టి కెలికారు నందమూరి బాలకృష్ణ. మొత్తానికి ఆయన కామెంట్లు కొంతమంది హృదయాలను భగ్గుమనేలా చేశాయి. మళ్ళీ ఒక్కసారిగా వివాదాలు చెలరేగిపోయాయి. చెలరేగిపోవడానికి ముఖ్య కారణం.. బాలయ్య పరోక్షంగా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేశారనే భావన కలగడం.
దీనికితోడు ‘మా’ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనే డిమాండ్ కూడా బాగా వినిపిస్తోంది. మురళీమోహన్ కూడా ఇదే అన్నారు. మొన్న మంచు విష్ణు కూడా పెద్దల సమక్షంలో ఏకగ్రీవం జరిగితే పోటీ నుంచి తప్పుకుంటాను అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. మా ఎన్నికల వివాదాల పై నాగబాబు మాట్లాడారు. ‘ఎన్నికలు జరగకూడదని, ఏకగ్రీవం చేయాలని అనుకోవడం చాలా తప్పు.
ఎన్నికలు జరగాలి, పోటీలో వారి వారి సామర్థ్యాన్ని, సమర్థను చూపించుకుని నెగ్గాలి. అయితే ఈ క్రమంలో పుట్టే గొడవలు మహా అయితే రెండు నెలలు ఉంటాయి. అయినా పర్వాలేదు. మా గొడవలు అన్నీ టీ కప్పులో తుపాను లాంటివి. కాబట్టి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక ప్రకాశ్ రాజ్ విజన్, ఆయన చెప్పిన ప్లానింగ్ బాగున్నాయి. అందుకే ఆయనకు మేం మద్దతిస్తున్నాం.
ఇక మంచు విష్ణు కూడా బిల్డింగ్ కడతాను అనడం బాగుంది. కాకపోతే ఆ బిల్డింగ్ కట్టే స్థలం ఎక్కడ ఉందో ఆయన చెప్పాలి. స్థలం ఎక్కడి నుంచి తెస్తారో కూడా ఆయన చెబితే బాగుటుంది’ అంటూ నాగబాబు వ్యగ్యంగా మాట్లాడాడు. బాలయ్య, మంచు విష్ణుకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి, నాగబాబు ఈ రకంగా సెటైర్లు వేసారని అంటున్నారు.