
రాష్ట్రంలో త్వరలోనే మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని, ఇది ప్రభుత్వ విధానమని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసి తీరుతామన్నారు. న్యాయస్థానంలో ఉన్న కేసులు సత్వరం పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే సీఎం పనిచేయవచ్చన్న మంత్రి న్యాయస్థానంలో కేసులకు, సీఎం పనిచేయడానికి సంబంధం లేదన్నారు.