
కరోనా మహమ్మారి రెండో ప్రభంజనంతో ఇబ్బందులు పడుతున్న భారత దేశానికి అండగా ఉంటామని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ తెలిపారు. శనివారం ఆయన ట్విటర్ వేదికగా భారత దేశానికి సంఘీభావం ప్రకటించారు. కోవిడ్ మమమ్మారి సమయంలో భారత దేశంలోని మిత్రులకు సహాయంగా నిలుస్తామన్నారు. భారత దేశం ఎంత బలమైనదో, శక్తిమంతమైనదో కోలుకునే సామర్థ్యం గలదో తమకు తెలుసునన్నారు.