Vivah Muhurat 2024: వివాహం అనేది ఒక మరుపురాని ఘట్టం. ముందు, తర్వాత జీవితం ఎలా ఉన్నా కూడా ఈ రోజు మాత్రం ఒక వింత అనుభూతి ఉంటుంది. ఈ రోజు గురించి ఎంతో మంది కలలు కంటారు కూడా. అయితే వివాహం ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా చేసుకుంటే కుదరదు అంటారు పండితులు. దీనికి మంచి ఘడియలు, శుభ ముహూర్తాలు చూడాల్సిందే. జాతకాలు కలవాల్సిందే. మరి మీరు కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓ సారి ఇది చదివేయండి.
హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరగాలంటే జ్యోతిష్యం, పంచాంగం వంటివి చూసిన తర్వాతనే శుభకార్యాలు చేస్తుంటారు. ముందుగా జాతకంలో శుక్రుని స్థానాన్ని చూసి ముహుర్తాలు నిర్ణయిస్తారు పండితులు. అయితే ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత మంచి ముహూర్తాలు ఉండేవి. కానీ ఈ సారి అలా లేదంట..
సీతారాముల కళ్యాణం తర్వాత మూడు నెలలు బాజా బజంత్రీలు మోగేవి కానీ. ఈ సారి మూడు నెలల వరకు అసలు ముహూర్తాలే లేవట. ఏప్రిల్ 6 నుంచి శ్రావణ మాసం వరకు వివాహాల కోసం శుభ ముహూర్తాలు లేవట. అయితే ప్రతి ముహూర్తం కూడా శుక్రుడిని గురువును పరిగణలోకి తీసుకొని ముహూర్తాలను నిశ్చయిస్తారు. సీతా రాముల కల్యాణం ఏప్రిల్ 17న జరగనుంది. ఆ తర్వాతి రోజు పట్టాభిషేకం జరుగుతుంది.
ఈ పండగ తర్వాత 21వ తేదీనా శుభ ముహూర్తం ఉంది. కానీ మూడాలకు దగ్గరగా ఉండడంతో శుభకార్యాలు చేయకపోవడం బెటర్ అంటున్నారు జ్యోతిష్యులు. మరి మీరు కూడా ఈ సారి ఇంట్లో శుభకార్యాలకు ముహూర్తాలు చూస్తున్నారా? ఎందుకు అయినా మంచిది ఓ సారి పండితులను కలవండి.