Homeఎంటర్టైన్మెంట్FUNKY Teaser Review : ఇదేమి తింగరి కామెడీ..'జాతి రత్నాలు' డైరెక్టర్ మరోసారి తన మార్క్...

FUNKY Teaser Review : ఇదేమి తింగరి కామెడీ..’జాతి రత్నాలు’ డైరెక్టర్ మరోసారి తన మార్క్ చూపించాడు!

FUNKY Teaser Review : జాతి రత్నాలు వంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ అనుదీప్ నుండి వచ్చిన ‘ప్రిన్స్’ అనే చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత అనుదీప్ డైరెక్షన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. దర్శకత్వం మీదకంటే ఆయన వెండితెర మీద నటుడిగానే ఎక్కువగా కనిపించాడు. అయితే రీసెంట్ గానే మూడు నెలల క్రితం హీరో విశ్వక్ సేన్ తో ఆయన ఫంకీ అనే చిత్రాన్ని మొదలు పెట్టాడు. కాయాదు లోహర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి యూత్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో హీరో విశ్వక్ సేన్ సినిమా డైరెక్టర్ గా నటించాడు, హీరోయిన్ కాయాధు లోహర్ నిర్మాత గా నటించినట్టు స్పష్టంగా అర్థం అవుతుంది.

ఈ సినిమా టీజర్ లో అనుదీప్ తన మార్క్ కామెడీ ని అడుగడుగునా చూపించాడు. ఆయన మార్క్ కామెడీ టైమింగ్ అన్ని సెక్షన్ ఆడియన్స్ కి నచ్చదు. కేవలం యూత్ ఆడియన్స్ మాత్రమే నచ్చుతుంది. కుళ్ళు కామెడీ అంటారు కదా?, ఆ టైపు అన్నమాట. టీజర్ మొత్తం చాలా ఫన్నీ డైలాగ్స్ ఉన్నాయి కానీ, ఎందుకో అవి హీరో విశ్వక్ సేన్ కి సూట్ కాలేదని అనిపించింది. ఈయనకు బదులుగా నవీన్ పోలిశెట్టి, లేదా సిద్దు జొన్నలగడ్డ హీరో గా చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది. ఇక హీరోయిన్ కాయదు నుండి కూడా కామెడీ టైమింగ్ ని లాగే ప్రయత్నం చేసాడు. అది కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. మొత్తం మీద లైలా వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత విశ్వక్ సేన్ కి ఈ సినిమా ఒక డీసెంట్ కం బ్యాక్ అయ్యేలాగానే కనిపిస్తుంది. చూడాలి మరి సినిమా కూడా ఆడియన్స్ ని ఇదే విధంగా అలరిస్తుందా లేదా అనేది. యూత్ ఆడియన్స్ ని అలరిస్తున్న ఈ టీజర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము, చూసి మీ అభిప్రాయం వ్యక్తం చేయండి.

 

FUNKY Teaser | Vishwak Sen, Kayadu Lohar | Anudeep KV | Bheems Ceciroleo | Naga Vamsi S

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version