Virat Kohli : రాంచీ మైదానంలో దక్షిణాఫ్రికా తో జరిగిన వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో విరాట్ తన మునుపటి ఆట తీరు ప్రదర్శించాడు. మైదానంలో చిరుత మాదిరిగా పరుగులు పెట్టాడు. దీంతో అభిమానులు కేరింతలు కొట్టారు. సహజంగానే విరాట్ కోహ్లీకి అభిమానుల ఆదరణ విపరీతంగా ఉంటుంది. పైగా అతడు సెంచరీ చెయ్యడం.. అభిమానులకు మరింత కిక్ ఇచ్చింది.
విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. అందులో ప్రధానమైనది విరాట్ కోహ్లీ టెస్టులలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు అనేది. దీనిపై స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంట్రీ చదివే వారు కూడా “వి వాంట్ కోహ్లీ బ్యాక్ ఇన్ టెస్ట్ ఫార్మాట్ ” ఓ యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. అయితే దీనిపై విరాట్ కోహ్లీ ఎట్టకేలకు స్పందించాడు.
సౌత్ ఆఫ్రికా పై గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ని వ్యాఖ్యాత అనేక ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలకు విరాట్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ” భవిష్యత్తులో ఒకే ఫార్మాట్లోనే ఆడుతా. ఇకపై ఎప్పుడూ అలానే ఉంటుంది. గడిచిన 16 సంవత్సరాలుగా దాదాపు 300కు పైగా వన్డేలు ఆడాను. బంతితో నేను ఎప్పుడూ టచ్ లోనే ఉన్నాను. ప్రాక్టీస్ సమయంలో బంతిని బలంగా ఎలా కొట్టాలో తర్ఫీదు పొందుతుంట. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కచ్చితంగా అది ఆట తీరుపై ప్రభావం చూపిస్తుంది. అలా ఆడుతూ ఉంటే పూర్వపు లయను అందుకోవడం పెద్ద కష్టం కాదు. రాంచి లో నా అనుభవం మొత్తం ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శారీరకంగా నేనెప్పటికీ సమర్థవంతంగానే ఉంటాను. మానసికంగా సిద్ధమై మ్యాచ్లు ఆడుతుంటాను. రాంచీ లో కూడా అదే జరిగింది.. ప్రసన్న వయసు 37 సంవత్సరాలు.. ఇప్పటికే నేను నా ఆటకు సంబంధించి మదిలో ఎప్పటికప్పుడు విజువల్ చేసుకుంటూనే ఉంటాను. ఈ మైదానంలో 25 ఓవర్ల పాటు ఆట ఒకరకంగా ఉంది. ఆ తర్వాత మైదానం చిత్రంగా మారిపోయిందని” విరాట్ వ్యాఖ్యానించాడు.
విరాట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి.. మైదానంలో ఆవేశంగా ఉండే విరాట్.. మైదానం వెలుపల మాత్రం శాంతంగా ఉంటాడు. ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు మాట్లాడిన మాటలు చాలామందిని ఆలోచింపజేశాయి. ఫామ్ గురించి అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విరాట్ చేసిన వ్యాఖ్యలు తగలాల్సిన వాళ్లకు తగిలాయని అతడి అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
VIRAT KOHLI IN THE POST MATCH PRESENTATION CEREMONY. pic.twitter.com/pafUw0swiC
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 30, 2025