
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కాస్త ఓపిక పట్టాలని మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సూచిస్తున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లు అతడి వికెట్ కోసం చూపిస్తున్న సహనాన్ని అతడు ప్రదర్శించడం లేదని పేర్కొన్నాడు. వదిలేయాల్సిన బంతులను ఆడుతూ వికెట్ ఇచ్చేస్తున్నాడని వెల్లడించాడు. ఇంగ్లాండ్ పేసర్లు విరాట్ కోహ్లీ వికెట్ కోసం ఎంతో ఓపిక పడుతున్నారు. కానీ, అతడు మాత్రం వారు చూపినంత సహనమూ ప్రదర్శించడం లేదు. అదే ప్రధాన తేడా అని సంజయ్ బంగర్ అన్నాడు.