Viral News : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రపంచం నలుమూలలో జరిగిన సంఘటనల్లో ఏదో ఒకటి వెలుగులోకి వస్తూనే ఉంది. అది కాస్త చర్చకు దారితీస్తూనే ఉంది.. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో పెళ్లి వార్త సంచలనం కలిగించింది.. పెళ్లి వార్త సంచలనం కలిగించడం ఏంటి? మటన్ ముక్కల కోసం కొట్టుకున్నారా? లేక పెళ్లికూతురు లేదా పెళ్లి కొడుకో పెళ్లికి ముందు లేచిపోయారా? అనే అనుమానాలు మీలో వ్యక్తం అవుతున్నాయి కదా.. కాకపోతే ఈ కథనంలో అంతకుమించి ట్విస్ట్ ఒకటి ఉంది.. అది ఏంటంటే..
సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఆమెకు 91 సంవత్సరాలు. ఓ 23 సంవత్సరాలు యువకుడి కుటుంబంతో ఆమె నివాసం ఉంటోంది. ఆ యువకుడికి తల్లి, సోదరుడు ఉన్నారు. ఆ యువకుడిది అత్యంత పేద కుటుంబం.. చదువుకునే స్తోమత లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. దొరికిన పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. కుటుంబం గడవడం కోసం.. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని ఆ యువకుడి కుటుంబం సాకుతోంది. దానికి ప్రతినెల ఆమె వారికి డబ్బు చెల్లిస్తుంది. అయితే ఆ ఇరవై మూడు సంవత్సరాల యువకుడికి ఆ వృద్ధురాలు ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది..”నన్ను పెళ్లి చేసుకో. నీకు డబ్బు ఇస్తాను. ఇంటి అవసరాలు కూడా తీర్చుతాను. నువ్వు చదువుకోవచ్చు. నావల్ల నీకు డబ్బు కూడా వస్తుంది. ఒకవేళ నేను చనిపోతే నా భర్త స్థానంలో నువ్వు ఉంటావు కాబట్టి పెన్షన్ కూడా వస్తుందని” ఆ వృద్ధురాలు చెప్పడంతో.. దానికి ఆ యువకుడు ఓకే అన్నాడు. తల్లి, సోదరుడు కూడా సమ్మతం తెలపడంతో ఆ వృద్ధురాలిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న అనంతరం వారిద్దరూ హనీమూన్ వెళ్లారు. అయితే ఆ సమయంలోనే ఆ వృద్ధురాలు హోటల్లోని బెడ్ పై పడి ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ఆ యువకుడు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ళి.. ఖనన సంస్కారాలు నిర్వహించాడు.
ఇది మొత్తం పూర్తయిన తర్వాత ఆ యువకుడు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.. అధికారులు విచారణకు వచ్చారు. ఆ యువకుడు ఆ వృద్ధురాలిని చంపాడని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిని జైలుకు పంపడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ.. తన నిర్దోషిత్వాన్ని ఆ యువకుడు నిరూపించుకున్నాడు. అదే కాదు జైలుకు వెళ్లే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.. అయితే ఇంత జరిగినప్పటికీ పెన్షన్ డబ్బులు ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పడంతో ఆ యువకుడు కన్నీటి పర్యంతమవుతున్నాడు. మరోవైపు వృద్ధురాలి ఆస్తులు కూడా వివాదాల్లో ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ఈ ఉదంతం అమెరికాలో జరిగిందని తెలుస్తోంది. అటు ఆస్తి రాకపోవడం, ఇటు పెన్షన్ కూడా లభించకపోవడంతో ఆ యువకుడు మళ్ళి పేదరికంలోకి వెళ్లిపోయాడు. పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.