https://oktelugu.com/

Jasleen Kaur Royal : దుల్కర్, విజయ్ కలిసి పైకి లేపిన ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టగలరా..ఈమె హిస్టరీ తెలిస్తే నోరెళ్లబెడుతారు!

ఫొటోలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ పైకి ఎత్తుకున్న ఆ అమ్మాయిని ఎవరో గుర్తు పట్టారా?..లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈమె ప్రత్యేకమైన ఆకర్షణగా నిల్చింది. ఎవరీ అమ్మాయి, ఇంత క్యూట్ గా ఉంది, ఇదే ఈవెంట్ కి వచ్చిన హీరోయిన్ మీనాక్షి చౌదరి ని కూడా డామినేట్ చేసేస్తుంది

Written By:
  • Vicky
  • , Updated On : November 8, 2024 / 04:49 PM IST

    Jasleen Kaur Royal

    Follow us on

    Jasleen Kaur Royal : ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కి మన టాలీవుడ్ యూత్ ఆడియన్స్ లో ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక మలయాళం హీరో మన ఇండస్ట్రీ లోకి వచ్చి ఇంత సక్సెస్ అవ్వడం అనేది గడిచిన దశాబ్ద కాలంలో ఎప్పుడూ జరగలేదు. దుల్కర్ సల్మాన్ మొదటి తెలుగు చిత్రం ‘మహానటి’. ఇందులో ఆయన జెమినీ గణేశన్ పాత్రలో జీవించేసాడు. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకడిగా నిలిచాడు. ఆ తర్వాత ఆయన హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతారామం’ లో నటించాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్న ఈ చిత్రం దుల్కర్ సల్మాన్ కెరీర్ లో మరో వంద కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాగా నిలబడబోతుంది.

    ఇదంతా పక్కన పెడితే పైన చూపిస్తున్న ఫొటోలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ పైకి ఎత్తుకున్న ఆ అమ్మాయిని ఎవరో గుర్తు పట్టారా?..లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈమె ప్రత్యేకమైన ఆకర్షణగా నిల్చింది. ఎవరీ అమ్మాయి, ఇంత క్యూట్ గా ఉంది, ఇదే ఈవెంట్ కి వచ్చిన హీరోయిన్ మీనాక్షి చౌదరి ని కూడా డామినేట్ చేసేస్తుందిగా, అసలు ఎవరు ఈ అందాల రాశి అని గూగుల్ లో వెతకగా, ఆమె పేరు జస్లీన్ కౌర్ రాయల్ అని తెలిసింది. ఈమె ఒక ప్రముఖ సింగర్. తెలుగు, హిందీ, పంజాబీ, బెంగాలీ వంటి భాషల్లో మాత్రమే కాదు, ఇంగ్లీష్ లో కూడా కొన్ని పాటలు పాడింది. కేవలం పాటలు పాడడం ఒక్కటే కాదు, ఈమెకి మ్యూజిక్ వాయించడం లోనూ, లిరిక్స్ రాయడంలోనూ మంచి నైపుణ్యం ఉంది. 2022 వ సంవత్సరంలో రణబీర్ కపూర్ హీరో గా నటించిన షేర్షా చిత్రానికి ఈమెకి సంగీత దర్శకురాలిగా పని చేసింది.

    అద్భుతమైన సంగీతం అందించినందుకు గాను ఆమెకి ఆ ఏడాదికి ఉత్తమ సంగీత దర్శకురాలిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అంతే కాదు లేడీస్ క్యాటగిరీలో ఉత్తమ సంగీత దర్శకురాలిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుని అందుకున్న మొట్టమొదటి మహిళగా జస్లీన్ నిల్చింది. అదే విధంగా ఈమె దుల్కర్ సల్మాన్ తో కలిసి ‘హిరియే..హిరియే’ అనే పాట కూడా పాడింది. సోషల్ మీడియా లో ఈ పాట ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇలా సంగీత విభాగంలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న జస్లీన్ ఇప్పుడు బాలీవుడ్ లో ఒక సినిమాలో హీరోయిన్ గా వెండితెర అరగేంట్రం చేసేందుకు సిద్దమైందట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తెలియచేయబోతుందట. చూపులు తిప్పుకోలేని అందంతో కుర్రాళ్ల మతిపోగొడుతున్న ఈమె, హీరోయిన్ గా ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.