Uttam Kumar Reddy: గోదావరి బనకచర్ల చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టు అని తెలంగాన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దిల్లీలో కేంద్ర జలశాఖ మంత్రి సీఆర్ పాటిల్ కు ప్రాజెక్టుపై అభ్యంతరాలను తెలియజేసిన అనంతరం మాట్లాడారు. బనకచర్లపై ఆందోళనలను కేంద్ర మంత్రికి చెప్పాం. ప్రాజెక్టు పై రాష్ట్ర ప్రజలు, రైతుల్లో ఆందోళనలు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పారు. త్వరలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఏర్పాటు చేస్తామని పాటిల్ చెప్పారు అని ఉత్తమ్ అన్నారు.
బనకచర్ల విషయంపై అతి త్వరలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీకి ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి pic.twitter.com/DVl51UXCUM
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2025