Donald Trump, assassination attempt : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రాణగండ తొలగిపోలేదు. ఎన్నికల సమయంలోనే రెండుసార్లు దాడి జరిగింది. ఒకసారి అయితే తృటిలో తప్పించుకున్నాడు. ఎన్నికల్లో విజయానికి ఈ దాడులు కూడా దోహదపడ్డాయి. ఇక అధ్యక్షుడు అయ్యాక దాడులు జరగలేదు. కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో ఇక సేఫ్ అనుకున్నారు. కానీ, ట్రంప్ లేపేసే కుట్రలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ట్రంప్ భద్రతపై ఇటీవల చోటు చేసుకున్న ప్రమాద సూచనలు అమెరికా పార్లమెంటరీ రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీశాయి. పామ్ బీచ్∙విమానాశ్రయంలో అధ్యక్షుడి విమానం నిలిపే ప్రాంతానికి ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తులు స్నైపర్‌నెస్ట్ ఏర్పాటుచేసినట్లు అధికారులు గుర్తించారు.
పక్కా స్కెచ్?
ఎయిర్ పోర్టులో అధ్యక్షుడిని లేపేసేందుకు విమానం నిలిపే ప్రాంతానికి సుమారు 200 గజాల దూరంలో చెట్టుపై స్నైపర్ నెస్ట్ ఉంది. అక్కడ దుండగుడు నక్కేందుకు నిచ్చెన ఏర్పాట్లు, వేటగాళ్ల గూడు లాంటి ఆకృతి పలువురిని ఉలిక్కిపడేసింది. సెక్యూరిటీ బృందం వెంటనే అప్రమత్తమై, విమానం మరో చోటికి తరలించడమే కాకుండా, ట్రంప్‌ను చిన్న మెట్ల ద్వారా జాగ్రత్తగా ఎయిర్‌ఫోర్స్ వన్‌లోకి చేర్చింది.
ఎఫ్‌బీఐ దర్యాప్తు..
ప్రమాదస్థలంలో పేలుడు పదార్థాలులేనప్పటికీ, డౌటు వ్యక్తుల అవశేషాలు దొరకలేదు. దుండగుల కోసం ఎఫ్‌బీఐ విస్తృత స్థాయిలో ఆధునాతన పథకాలతో అన్వేషణ మొదలుపెట్టింది. నిపుణుల ఆధ్వర్యంలో అన్ని యాంగిల్స్‌ను పరిశీలిస్తున్నారు. అమెరికాలో రాజకీయ నాయకులపై దాడులు కొత్తవి కాకపోవచ్చు. ఇప్పటికే ట్రంప్ ఎన్నికల ప్రచార సందర్భంగా పెన్సిల్వేనియాలో దాడి ముతో ఊహించదగిన ఉదంతం జరిగింది. కాల్పుల్లో అతడి చెవికి గాయమవ్వగా, సీక్రెట్ సర్వీస్ చురుగ్గా స్పందించి ఆయన్ని అన్నిచోట్ల రక్షించుకుంది. తాజాగా ఫ్లోరిడాలోనే మరో హత్యాయత్నం. ఇది అధ్యక్ష భద్రత పట్ల మరింత అప్రమత్తత అవసరమని చాటింది.
తాజా ఘటనలో ట్రం‹ప్ భద్రత మరింత కట్టుదిట్టమైంది. అత్యవసర సమయంలో పరిమితులు ఉన్న మెట్ల మార్గాన్ని వినియోగించడం, విమానాన్ని మారుమూల ప్రాంతాలకు తరలించడం వంటి ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నారు. భవిష్యత్తులో అదనపు భద్రతా ఒడిదుడుకులు, నూతన నియమావళి రావొచ్చన్న సంకేతాలు అధికార వర్గాలు ఇస్తున్నాయి.