
Uttar Pradesh: సినిమాల్లో చూస్తుంటాం ముక్కోణపు ప్రేమకథ. ఇక్కడ కూడా అలాంటి ప్రేమకథ ఒకటి చోటుచేసుకుంది. సాధారణంగా పెళ్లయిన తరువాత భార్యను వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కానీ అతడో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. తాను వివాహం చేసుకున్న వ్యక్తిని ఆమె ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించి తనలోని మానవత్వాన్ని చాటాడు. దీంతో అతడి చర్యను అందరు ప్రశంసిస్తున్నారు. ఆరు నెలలైనా భార్య కోరుకున్న వాడితో పంపేందుకు నిర్ణయించుకుని తాను కూడా ఓ మానవతావాదిగా మారాడు.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని కాన్పూర్ కు చెందిన కోమల్, పంకజ్ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరు నెలల క్రితం పెళ్లయింది. కానీ పెళ్లయిన నుంచి భార్య ముఖంలో సంతోషం కనిపించలేదు. దీంతో విషయం ఏంటని ప్రశ్నించాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో తాను నీ కోరిక తీరుస్తానని హామీ ఇచ్చాడు. ఈనేపథ్యంలో ఆమె తన మనసులోని మాట చెప్పింది. తాను ఇదివరకే ఓ వ్యక్తిని ప్రేమించానని చెప్పింది. ఆయనంటే చాలా ఇస్టం. ఇప్పటికి కూడా అతడినే ప్రేమిస్తున్నానని తెలిపింది.
దీంతో ఆమె ప్రియుడు పింటూను కలిసి జరిగిన విషయం చెప్పాడు. మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తానని హామీ ఇచ్చాడు. పెద్దలను సైతం తానే ఒప్పిస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం పింటూ తల్లిదండ్రులను పంకజ్ కుటుంబాన్ని ఒప్పించి వారిద్దరికి పెళ్లి జరిపించాడు. తానే మధ్యవర్తిగా ఉండి ఈ వేడుక నిర్వహించాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు.
దీంతో భార్య ఆనందం కోసం కోమల్ కోరిక తీర్చేందుకు పంకజ్ తీసుకున్న నిర్ణయం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ రోజుల్లో కూడా ఇంతటి నిస్వార్థం ఉంటుందా అని వేనోళ్ల పొగుడుతున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. స్వార్థం కోసం ఎంతకైనా తెగించే నేటి రోజుల్లో నిస్వార్థంగా భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేయడం సంచలనంగా మారింది.