
ఉత్తరప్రదేశ్ రాష్ట్రము హత్రాస్ లో జరిగిన సంఘటనతో దేశమే ఒక్కసారిగా ఉల్లిక్కి పడగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు దేశ ప్రజలు. తాజాగా బీజేపీ నేత ఉమా భారతి దీనిపై స్పందింస్తూ హత్రాస్ ఘటనలో చనిపోయిన మహిళా అంత్యక్రియలను తల్లితండ్రులు లేకుండా జరిపించడం, మహిళా కుటుంబాన్ని, గ్రామస్థులను ఎవరితో కలవనీయకుండ చర్యలు తీసుకోవడం, పోలీసుల ప్రవర్తన చాలా బాధాకరంగా ఉందని, దేశమంతా రామరాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చాం. పోలీసుల తీరు యుపి ప్రభుత్వ ప్రతిష్టతో పాటు బిజెపికి కూడా మచ్చతెచ్చేవిధంగా ఉంది.’ అని ట్విట్టర్ వేదికగా స్పందించారు.