
దేశంలో కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని ఎయిమ్స్ చీఫ్ డా. రణ్ దీప్ గులేరియా మరోసారి గుర్తు చేశారు. చాలా మంది మొదటి డోసే పొందనప్పుడు.. బుస్టర్ డోసుల గురించి మాట్లాడటం సరైంది కాదు అని అన్నారు. ప్రపంచంలో అందరూ సురక్షితంగా ఉండే వరకూ వ్యక్తిగతంగా ఏ ఒక్కరూ సురక్షితంగా లేరని భావించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి మహమ్మారి నుంచి బయటపడేందుకు ఇదొక్కటే మార్గమని ఆయన సూచించారు.