
క్లిష్ట పరిస్థితుల్లో కొవిడ్ సెకండ్ వేవ్ తో పోరాడుతున్న ఫ్రంట్ లైన్స్ లోని నర్సులందరి అసాధారణ సహకారానికి సాటిలేదని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నడూ సానుభూతి, బలంతో ప్రపంచాన్ని స్వస్థత పరుస్తున్నందుకు పెద్ద కృతజ్ఞతలన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ మనందరికీ సవాలుగా మారిందన్నారు.