
ఐపీఎల్ 2021 లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అనుసరించిన వ్యూహాలపై క్రీడా విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఆఖరి దాకా పోరాడి కూడా స్వీయ తప్పిదాల వల్ల మ్యాచ్ ను చేజార్చుకుందంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్ ఓవర్ లో ఓపెనర్ జానీ బెయిర్ స్టోను ఆడించకపోవడం పై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆశ్యర్యం వ్యక్తం చేశాడు. సూపర్ ఓవర్ జరుగుతున్న సమయంలో ఒక వేఝళ బెయిర్ స్టో గనుక టాయిలెట్ లో ఉండి ఉంటే తప్ప అతడిని ఎందుకు ఆడించలేదో అర్థం కావడం లేదు. హైదరాబాద్ పోరాట పటిమ నిందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని వీరు ఘాటుగా స్పందించాడు.