Sri Parabhava Nama Samvatsara Rasi Phalalu: తెలుగు ప్రజలు కొత్త సంవత్సరంగా భావించే ఉగాది పండుగ మార్చి 19న గురువారం జరుపుకొనున్నారు. ఈ పండుగతో శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటే యుగానికి ఆది.. అంటే తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇప్పుడే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని భావిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ నిర్వహిస్తారు. ఈరోజు నుంచే సృష్టి ఆరంభమైందని పురాణాలు చెప్పబడుతున్నాయి. అయితే ఉగాది సందర్భంగా కొత్త పంచాంగం కూడా ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఈ ఏడాదిలో 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేష రాశి:
ఆదాయం -11, వ్యయం- 05, రాజ పూజ్యం -02, అవమానం -04
ఈ రాశి వారికి మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు గురు గ్రహ బలం అధికంగా ఉంటుంది. దీంతో వీరు అనుకున్న ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలలో సంతాన ప్రయత్నాలు పలిస్తాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అయితే కుటుంబ వాతావరణం లో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆసుపత్రుల ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులను గౌరవించడం వల్ల సరైన పరిహారం పొందే అవకాశం ఉంటుంది.
వృషభ రాశి:
ఆదాయం -05, వ్యయం- 14, రాజ పూజ్యం -05, అవమానం -04
ఈ ఏడాదిలో ఈ రాశి వారు ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని వెంటనే పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం పొందడంతో ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులు వ్యాపారులకు మద్దతుగా ఉంటారు. విజయాలు పొందడంతో సంతోషంగా ఉండగలుగుతారు. స్థిరాస్తులకు సంబంధించి, వాహనాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులు అనుకున్న విజయాలను పొందుతారు. ఇంట్లో సామరస్యంగా వాతావరణం ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అయితే మెడలో వెండి గొలుసు ధరించడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి.
మిథున రాశి:
ఆదాయం -08, వ్యయం- 11, రాజ పూజ్యం -01, అవమానం -07
మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పెరుగుతుంది. గతంలో చేపట్టిన కొన్ని ప్రయత్నాలు ఇప్పుడు సక్సెస్ అవుతాయి. విద్యార్థులు పై చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తారు. మీరు అనుకున్న ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేరడానికి మార్గం ఏర్పడుతుంది. కుటుంబా వాతావరణం సామరస్యంగా ఉంటుంది. చిన్నచిన్న విభేదాలు వచ్చినా కూడా వెంటనే పరిష్కారం అవుతుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంధులకు ఆహారం సహాయం చేయడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి:
ఆదాయం -02, వ్యయం- 11, రాజ పూజ్యం -04, అవమానం -07
కర్కాటక రాశి వారు ఈ ఏడాది ఒత్తిడిని చేయిస్తారు. ముఖ్యంగా కార్యాలయాల్లో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయినా కూడా ఇవి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతిరోజు తప్పకుండా నుదుటిపై కుంకుమ ఉండేలా చేస్తే చిన్నచిన్న దోషాలు తొలగిపోతాయి.
సింహ రాశి:
ఆదాయం -05, వ్యయం- 05, రాజ పూజ్యం -07, అవమానం -07
ఈ రాశి వారు ఈ ఏడాది డబ్బులను బాగా పొదుపు చేస్తారు. ఖర్చులను తగ్గించుకుంటారు. మొదటి అర్థభాగం లో ఈ పరిస్థితి ఉంటుంది. కానీ తర్వాత ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వాహనం కొనాలని ప్రయత్నం చేసేవారు సక్సెస్ అవుతారు. విద్యార్థులు చదువుకోవడానికి ఇంటికి దూరంగా వెళ్తారు. అయితే ఈ రాశి వారి బలహీనతల వల్ల ఎదుటివారి నుంచి అవమానాన్ని పొందుతారు. వైవాహిక సంబంధాల్లో విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. దోషాల నుంచి బయటపడాలంటే వెంట వెండి ఉండేలా చూసుకోవాలి.
కన్య రాశి:
ఆదాయం -08, వ్యయం- 11, రాజ పూజ్యం -03, అవమానం -03
ఈ రాశి వారు ఈ ఏడాది స్థిరాస్తులను పెంచుకుంటారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా స్థిరపడేందుకు కొత్త వ్యక్తులను కలుస్తారు. ఈ ఏడాది చివరి లో అన్ని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి జీవితంలో విజయాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే వైవాహిక జీవితం కాస్త ఆందోళనగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బందుని పెడతాయి. కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండి వెంటనే పరిష్కరించుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ రాశి వారు నల్ల ఆవుని సేవించడం వల్ల కొన్ని దోషాల నుంచి బయటపడతారు.
తుల రాశి:
ఆదాయం -05, వ్యయం- 14, రాజ పూజ్యం -06, అవమానం -03
పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి చేసే ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ ఏడాది అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడతారు. అయితే సరైన ఆహారం తీసుకొని కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రయత్నాలు సక్సెస్ కాకపోవచ్చు. ఈ రాశి వారు ఈ ఏడాది మాంసం, మద్యం నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.
వృశ్చిక రాశి:
ఆదాయం -11, వ్యయం- 05, రాజ పూజ్యం -02, అవమానం -06
ఈ రాశి వారు ఈ ఏడాది కెరీర్ విషయంలో సంతోషంగా ఉంటారు. ఎందుకంటే అనుకున్న ప్రతి అడుగు సక్సెస్ అవుతుంది. తోటి వారి మద్దతు కూడా ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఖర్చులను తగ్గించుకుంటారు. కొత్త ఆస్తులను సంపాదిస్తారు. విద్యార్థులకు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది అయితే రెండవ అర్థభాగంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో అశాంతి నెలకొనే అవకాశం ఉంటుంది. ప్రియమైన వారితో ఎలాంటి విభేదాలు లేకుండా చూసుకోవాలి. శరీరంపై వెండిని ధరించడం వల్ల కొన్ని దోషాల నుంచి బయటపడే అవకాశం.
ధనస్సు రాశి:
ఆదాయం -14, వ్యయం- 11, రాజ పూజ్యం -01, అవమానం -02
ఈ రాశి విద్యార్థులు తమ కృషికి అనుగుణంగా ఫలితాలు పొందుతారు. చాలామంది వ్యాపారులు గతంలో నష్టపోయి ఉంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల తోడు ఉండడంతో లాభాలు ఎక్కువగా పొందుతారు. అధికారుల మద్దతు ఉండడంతో ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. కొన్ని నిర్ణయాలను వాయిదా వేయడమే మంచిది. ఉన్నత చదువుల కోసం దూర ప్రయాణాలు చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పక్షులకు, పశువులకు ఆహారం సమర్పించడం ద్వారా కొంతవరకు పరిహారం పొందవచ్చు.
మకర రాశి:
ఆదాయం -02, వ్యయం- 08, రాజ పూజ్యం -01, అవమానం -02
మీ రాశి వారికి ఏడాది అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వివాహం చేసుకున్న వారి జీవితం సంతోషంగా గడుస్తుంది. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు పలిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అదృష్టం కొద్దీ ఆదాయం పెరుగుతుంది. అయితే ఉద్యోగులు సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తేనే ఆదరణ ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. వైవాహిక జీవితం లో కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి. ఈ రాశి వారు దగ్గరగా వెండి ఉంచుకోవడం వల్ల కొన్ని ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
కుంభ రాశి:
ఆదాయం -02, వ్యయం- 08, రాజ పూజ్యం -04, అవమానం -02
ఈ రాశి వారు ఈ ఏడాది కొత్త ప్రాజెక్టులను సక్సెస్ చేసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆస్తికి సంబంధించి శుభవార్తను వింటారు. అయితే వాహనాలు కొనుగోలు చేయడం వాయిదా వేసుకోవడం మంచిది. పెట్టుబడులకు ఇదే మంచి సమయం. వ్యాపారులు ఘననీయంగా లాభాలు పొందుతారు. విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రయాణాలు చేస్తారు. వైవాహిక జీవితంలో కొన్ని అపార్థాలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. ఈ రాశి వారు వెండిని ధరించడం వల్ల సానుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది.
మీన రాశి :
ఆదాయం -14, వ్యయం- 11, రాజ పూజ్యం -07, అవమానం -02
ఈ రాశి వారు రాజకీయ నాయకులు అయితే అనుకున్న ఫలితాలు పొందుతారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. అప్పులను తీర్చి సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అయితే ఉద్యోగులు కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రాశి వారు మర్రిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేయాలి.
