
నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్ట శివారులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రైల్వే ప్రహారీ గోడ కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మురికి కాలువకు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడకూలి మట్టి పెళ్లలు పైన పడడంతో అక్కడికక్కడే మరణించారు. మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.