
భారత్ లో కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతుంది. రెండు డోసుల టీకాలు తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారినపడే అవకాశాలుంటాయని వైద్యనిపుణుల చెబుతున్నారు. ఇటువంటి వారిలో వైరస్ తీవ్రత స్వల్పంగా ఉంటుందని, ఐసీయూల్లో చేరి వెంటిలేటర్ చికిత్స పొందాల్సిన పరిస్థితులు ఎదురుకావని తెలిపారు. ఐతే కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాతో పోరాడుతూ తమిళనాడుకు చెందిన మరో ఇద్దరు పోలీస్ అధికారులు మరణించారు. ఇద్దరు అధికారులు కూడా రెండు డోసుల టీకా తీసుకున్నారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఈశ్వరన్ (52) స్పెషల్ సబ్ ఇన్ స్పెక్టర్ రవి(57) కరోనాతో చనిపోయారు. కొవిడ్ సెకండ్ వేవ్ లో చెన్నైలో మరణించిన పోలీసుల సంఖ్య 12కు పెరిగింది.