
కొవిడ్ బాధితులకు కోసం తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. ఏపీలోని 22 ప్రాంతాల్లో జర్మన్ షెడ్ల నిర్మాణానికి రూ.352 కోట్లు కేటాయించినట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ప్రకటించారు. విశాలో 4, ప్రశాశంలో 2, అనంతపురంతో 3, కృష్ణాలో 3, కర్నూలులో 2, గుంటూరులో 3, కాకినాడలో 3 షెడ్ల నిర్మాణం చెయ్యనున్నట్లు తెలిపారు. ఒక్కోషెడ్లో 30 ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. టీటీడీ సర్వే శ్రేయోనిధి నుంచి నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.