
డిపార్ట్ మెంటల్ పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్పీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. కొవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగింపు కారణంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్ మెంటల్ పరీక్షలను మే సెషన్ ను వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణకు కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది.