Homeఅంతర్జాతీయంMelania Trump : ట్రంప్, మెలానియా విడాకులు.. పెద్ద ప్లానే వేశారుగా..

Melania Trump : ట్రంప్, మెలానియా విడాకులు.. పెద్ద ప్లానే వేశారుగా..

Melania Trump : మనం ఒక పని చేశామనుకోండి.. అందులో పెద్ద తప్పు చేసుకుందనుకోండి.. దాని నుంచి జనాలను మళ్ళించడానికి ఏదో ఒక ప్లాన్ రూపొందిస్తాం. అయితే అది బలమైన ఎమోషన్ తో కూడుకున్నది కావాలి. ఎందుకంటే ఒక తప్పు జరిగినప్పుడు కచ్చితంగా దాన్ని డైవర్ట్ చేసే విధానం బలంగా ఉండాలి. అప్పుడే మనం చేసిన తప్పు మరుగున పడుతుంది. ఇంకొక విషయం తెరపైకి వస్తుంది. దీంతో జనాలలో చర్చ మరో విధంగా జరుగుతుంది.

ఇప్పుడు ఇదే విధానాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సతీమణి మెలానియా అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అమెరికా పరిపాలనలో మెలానియా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. కానీ, ఇప్పుడు ఆమె అమెరికా పరిపాలనలో ప్రవేశించినట్టు తెలుస్తోంది.. ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అలా ఉన్నాయి. మెలానియా అకస్మాత్తుగా ఇప్పుడు ఎఫ్ స్టీన్ గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. దీని వెనక రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రసంగంలో ట్రంప్ గురించి ఒక్క మాట కూడా వినిపించలేదు. దీంతోపాటు.. ఎఫ్ స్టీన్ వ్యవహారంలో దారుణాలకు పాల్పడిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. దీంతో అమెరికా ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎఫ్ స్టీన్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత.. మెలానియా ఒకసారి కూడా గట్టిగా మాట్లాడలేదు. కనీసం ఆ ఉదంతం గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు ఆమె అకస్మాత్తుగా ఈ పల్లవి ఎత్తుకోవడం రకరకాల చర్చలకు దారి తీస్తోంది.

మెలానియా ట్రంప్ పేరు ప్రస్తావించకపోవడం పట్ల తెలివైన ఎత్తుగడ ఉందని అమెరికన్ విశ్లేషకులు చెబుతున్నారు.. యుద్ధం వల్ల ట్రంప్ రకరకాల విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇరాన్ కూడా విపరీతంగా దూషిస్తోంది. యుద్ధం నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతున్న మాటలు కూడా సక్రమంగా లేదు. ట్రూత్ సోషల్ లో ఆయన మాట్లాడుతున్న మాటలు స్థిమితం ఉన్నట్టుగా కనిపించడం లేదు. ప్రజలు మొత్తం ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల దృష్టి మళ్లించడానికి మెలానియా ఈ ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.. త్వరలో ఎఫ్ స్టీన్ రహస్య మెయిల్స్ ద్వారా సంచలన విషయం బయటకు వస్తుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎఫ్ స్టీన్ వ్యవహారంలో ట్రంప్ పేరు కూడా వినిపించింది. మొదట్లో అతని ఫోటోలు విడుదలయ్యాయి. ఆ తర్వాత వాటిని కనిపించకుండా చేశారు. ఇప్పుడేమో మళ్లీ ట్రంప్ గురించి మాట్లాడుతున్నారు. త్వరలో రహస్య ఈమెయిల్స్ ద్వారా కీలక విషయాలు బయటకు వస్తాయని ప్రచారం జరుగుతుంది. అదే గనుక జరిగితే ట్రంప్ కు మరింత ఇబ్బంది తప్పదా అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ట్రంప్ ను మెలానియా సమర్థించకపోవడం వల్ల.. అతడు చేసిన తప్పుడు వ్యవహారాలు వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ట్రంప్ వ్యవహార శైలి వల్ల మెలానియా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. అందువల్లే ఆమె ఎఫ్ స్టీన్ వ్యవహారం తెరపైకి తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular