
తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొత్తపేట మండలం కడుకంట్ల వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులను అనంతపురం జిల్లా పుట్టపర్తి వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు.