
రాజద్రోహం సెక్షన్ (124ఏ) దుర్వినియోగం అవుతోందని దీన్ని రద్దు చేసే అంశంపై త్వరలో రాష్ట్రపతి అధ్యక్షతన జరగనున్న గవర్నర్ల సదస్సులో చర్చింది, మద్దతు తెలపాలని ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల గవర్నర్లు ఎల్ జీలకు ఆయన లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం వైఫల్యాలు ప్రస్తావించినందుకే తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని గవర్నర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత కక్షతో కేసులు పెట్టించారని ఆరోపించారు. ఏపీ సీఐడీ కార్యాలయంలో తనను క్రూరంగా హింసించారని రఘురామ తెలిపారు.