
మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. శనివారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే విమానంలో ఉన్న ట్రైనర్, శిక్షణ లో ఉన్న ఫైలట్ ఇద్దరూ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా స్పందించారు. సెన్నా మోడల్ విమానం క్రాష్ అయినట్లు ఇప్పుడే తెలిసింది. శిక్షణలో ఉన్న ట్రైనీ ఫైలట్ కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఘటనా స్థలానికి దర్యాప్తు బృందాలను పంపించాం అని ఆయన పేర్కొన్నారు.