అవును, త్రివిక్రమ్ అంటే వెంకటేష్ కి కోపం !

కొన్ని కాంబినేషన్స్ విపరీతంగా వైరల్ అవుతాయి. కానీ, ఆ కలయికలో మాత్రం సినిమా సెట్ అవ్వదు. సంవత్సరాలు తరబడి వార్తల్లో నలిగి చివరకు కలిసి సినిమా కూడా చేయకుండానే విడిపోతారు. ఇలాంటి కాంబినేషన్స్ లో బాగా వైరల్ అయిన కాంబినేషన్ అంటే, వెంకటేష్ – తరుణ్ భాస్కర్ కాంబినేషనే. వీరిద్దరి సినిమా అంటూ దాదాపు మూడేళ్ళుగా ఏదొక వార్త వినిపిస్తోంది. మధ్యలో అప్పుడు షూట్ ఇప్పుడు స్టార్ట్ అంటూనే మూడేళ్లు గడిచిపోయింది. కానీ, తరుణ్ భాస్కర్ మాత్రం […]

Written By: admin, Updated On : July 17, 2021 6:04 pm
Follow us on

కొన్ని కాంబినేషన్స్ విపరీతంగా వైరల్ అవుతాయి. కానీ, ఆ కలయికలో మాత్రం సినిమా సెట్ అవ్వదు. సంవత్సరాలు తరబడి వార్తల్లో నలిగి చివరకు కలిసి సినిమా కూడా చేయకుండానే విడిపోతారు. ఇలాంటి కాంబినేషన్స్ లో బాగా వైరల్ అయిన కాంబినేషన్ అంటే, వెంకటేష్ – తరుణ్ భాస్కర్ కాంబినేషనే. వీరిద్దరి సినిమా అంటూ దాదాపు మూడేళ్ళుగా ఏదొక వార్త వినిపిస్తోంది.

మధ్యలో అప్పుడు షూట్ ఇప్పుడు స్టార్ట్ అంటూనే మూడేళ్లు గడిచిపోయింది. కానీ, తరుణ్ భాస్కర్ మాత్రం ఇంతవరకు వెంకీతో సినిమా మొదలుపెట్టలేదు. అలాగే, చిరంజీవి-పవన్ కళ్యాణ్ తో మూవీ అని ఆ మధ్య.. అబ్బో.. ఓ రేంజ్ లో ఈ వార్త హల్ చల్ చేసింది. చివరకు, ఇది ఒట్టి రూమర్ గానే మిగిలిపోయింది. ఇక స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి బోలెడు రూమర్స్ పుట్టించారు.

అందులో ముఖ్యంగా తమిళ స్టార్ హీరో సూర్యతో ఒక మూవీ ఫిక్స్ అయిందని అన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్, ఈ సారి తనకు వచ్చిన గ్యాప్ లో కచ్చితంగా వెంకటేష్ తో మూవీ చేస్తాడు అంటూ బాగా ప్రచారం జరిగింది. కానీ ఇది కూడా పుకారుగానే తేలిపోయింది. అయితే, వెంకటేష్ అభిమానుల్లో మాత్రం ఇంకా కొన్ని ఆశలు ఉన్నాయి. కాకపోతే ఆ ఆశలు ఫై నీళ్లు చల్లారు వెంకీ.

తాజాగా ‘నారప్ప’ సినిమా మీడియా ప్రొమోషన్ లో పాల్గొన్నాడు వెంకీ. ఈ సందర్భంగా మీడియా జనం ‘తరుణ్ భాస్కర్’తో ప్లాన్ చేసిన సినిమా గురించి, అలాగే త్రివిక్రమ్ తో అనుకున్న మూవీ గురించి వెంకటేష్ ను డైరెక్ట్ గా అడిగారు. అయితే, వెంకీ మాత్రం ‘ఏది మన చేతిలో లేదమ్మా’ అంటూ తేల్చి చెప్పారు.

అయితే, తరుణ్ భాస్కర్ ఇంకా ఏదో రాస్తున్నాడు చూద్దాం అన్నట్టు చెప్పిన వెంకటేష్, త్రివిక్రమ్ గురించి మాత్రం అసలు మాట్లాడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో, అవును.. త్రివిక్రమ్ అంటే వెంకటేష్ కి కోపం అంటూ ప్రచారం మొదలైంది.