
తెలంగాణ ఈసెట్ ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఈసెట్ ఫలితాలు వెల్లడించనున్నట్లు టీఎస్ ఈసెట్ కన్వీనర్ సీహెచ్ వెంకటరమణారెడ్డి తెలిపారు. జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్ లోని యూజీసీ-హెచ్ఆర్డీసీ ఆడిటోరియంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.