
టోక్యో ఒలింపిక్స్ లో కరోనా కలకలం రేపింది. ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో తొలి కరోనా కేసు నిర్ధరణ అయింది. క్రీడల నిర్వహకుడికి కొవిడ్ సోకినట్లు సమాచారం. మరోవైపు ఈనెల 23 నుంచి ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈనెల 13న ఈ క్రీడా గ్రామాన్ని తెరిచారు. గతేడాది జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఈ ఏడాది నిర్వహించనున్న ఈ విశ్వక్రీడల్లో 11 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.