Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అపారమైన ధన లాభం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈరోజు ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులు తోటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఖర్చులు ఆచితూచిపెట్టాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ప్రశంసలు అందుతాయి. కొందరికి పదోన్నతి కూడా వస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కమ్యూనికేషన్ రంగంలో పనిచేసే వారికి శుభవార్తలు అందుతాయి. నాణ్యమైన పనితీరును ప్రదర్శించడం వల్ల ప్రశంసలు అందుతాయి. పదోన్నతులు పొందేందుకు ఇదే మంచి సమయం. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు అనుకోకుండా విహార యాత్రలకు వెళ్లాల్సి వస్తుంది. పాత స్నేహితులు కలవడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఏ పని మొదలుపెట్టిన వెంటనే పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ఆలోచన ఉంటే మానుకోవడమే మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలను ఉపయోగించొద్దు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఏ చిన్న పని చేసినా దానిపై ప్రశంసలు అందుతాయి. అనుభవం ఉన్న వారి నుంచి ఉద్యోగులు సలహాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. వ్యాపారులకు పెద్దల అండదండలు ఉండడంతో కొత్తపెట్టబడులు పెడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కార్యాలయాల్లో అన్నీ అనుకూలమైన సమయాలు ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు అనుకున్న పనులను వెంటనే పూర్తి చేస్తారు.. కొందరికి కొత్త బాధ్యతలు అందుతాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. నాణ్యమైన సమయాన్ని పిల్లలతో గడుపుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వ్యాపారులు కొత్త పెట్టుబడులు విషయంలో పెద్దల సలహా తీసుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కార్యాలయాల్లో అన్ని పనులను పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు మానసిక ప్రశాంతత కోసం వికార యాత్రలకు వెళ్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. వ్యాపారులు కొన్ని రిస్కులు తీసుకుంటారు. వీటివల్ల అనేక లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఇంట్లో కొన్ని ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. కొందరు తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఆందోళన వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో ఎలాంటి మాటలు మాట్లాడకపోవడమే మంచిది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి కుటుంబ జీతం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. వ్యాపారులు ఆహ్లాదంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి ఇంట్లో ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో ఏదైనా పనిని మొదలు పెడితే దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి ఇదే మంచి సమయం.

