Homeఆధ్యాత్మికంToday horoscope in telugu 7.4.2026 : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్...

Today horoscope in telugu 7.4.2026 : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై జ్యేష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు కెరీర్ విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారాల నుంచి ప్రశంసలు పొందుతారు. అందరికీ పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి. గతంలో మొదలుపెట్టిన పనులను పూర్తి చేయడానికి కృషి చేయాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు అధిక ఆదాయాన్ని పొందుతారు. ఉద్యోగులు గతంలో చేసిన కొన్ని ప్రాజెక్టులను ఈరోజు పూర్తి చేస్తారు. దీంతో అదనపు ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారులు ఈరోజు ఊహించిన దాని కంటే ఎక్కువగా లాభం పొందుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగించేందుకు ఓ వ్యక్తి సహాయం తీసుకుంటారు. బంధువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. దీంతో ఇప్పటివరకు ఉన్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఓ ముఖ్యమైన ప్రాజెక్టును పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు తోటి వారి నుంచి సహాయం అందుతుంది. దీంతో సమయానికి అనుకూలంగా కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో చాకచక్యంగా వ్యవహరించి సమస్య నుంచి బయటపడాలి. ప్రయాణాలకు ఈరోజు అనుకూల సమయం.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని చట్టపరమైన చెక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా గడుపుతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉండలున్నాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు. దీంతో వీరి వ్యాపార అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన చెక్కుల నుంచి బయటపడతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ముందుకు వెళ్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది. పెట్టుబడులకు సంబంధించి శుభవార్తలు వింటారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. సంతోషకరమైన వాతావరణం లో ఉంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు అధిక లాభాలు రావడంతో సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం కూడా ఉంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. అయితే విదేశాల్లో వ్యాపారం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పై చదువుల కోసం విద్యార్థులు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు విజయం సాధిస్తారు. తల్లితండ్రుల ఆరోగ్యంపై కీలక నిర్ణయం తీసుకుంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు తోటి వారి సహాయంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా మెరుగైన జీవితం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందవచ్చు. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంతో సంతృప్తిగా ఉంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవం పొందుతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందర పడవద్దు. ప్రత్యర్థులకు దూరంగా ఉండటమే మంచిది. వ్యాపారులు నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడితే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version