Homeఎంటర్టైన్మెంట్Rajinikanth Kamal Haasan Movie Clash: రజినీకాంత్ - కమల్ హాసన్ మధ్య గొడవలు...

Rajinikanth Kamal Haasan Movie Clash: రజినీకాంత్ – కమల్ హాసన్ మధ్య గొడవలు పెట్టించిన దర్శకుడు అతనే…

Rajinikanth Kamal Haasan Movie Clash: సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ – కమల్ హాసన్ లకుచాలా మంచి గుర్తింపైతే ఉంది. వీళ్లిద్దరూ చేసిన సినిమాలతో ప్రేక్షకులందరిని అలరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు వాళ్ళు సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు దూసుకెళ్తుండటం మరొకెత్తుగా మారుతుంది. రజినీకాంత్ మధ్యగత కొద్దికాలం నుంచి మాటలైతే లేవంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ ఎట్టకేలకు వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి నటిస్తుండడంతో ఆ వార్తలకు చెక్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే వీళ్ళిద్దరు కలిసి నటించడం పట్ల తమిళ్ సినిమా ప్రేక్షకుడితో పాటు యావత్ ఇండియన్ ప్రేక్షకులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా సక్సెస్ ను సాధిస్తుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని చాలామంది చాలా సంవత్సరాల నుంచి కోరుకుంటున్నారు. ఎట్టకేలకు అదైతే పాసిబుల్ అయింది. గతంలో వీళ్లిద్దరి మధ్య కొద్ది రోజులపాటు మాటలు లేవట. నిజానికి కే ఎస్ రవికుమార్ అనే దర్శకుడి వల్లే వీళ్ళ మధ్య మాటలు లేవని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఆయన రజినీకాంత్ కమల్ హాసన్ ఇద్దరితో సినిమాలు చేశాడు. ‘నరసింహ’ సినిమాని మొదట కమల్ హాసన్ తో చేస్తానని చెప్పి ఆ తర్వాత రజనీకాంత్ తో చేశాడు. అలాగే ‘దశావతారం’ సినిమాని రజనీకాంత్ తో చేస్తానని చెప్పి కమల్ హాసన్ చేశాడు. ఇక ఈ దర్శకుడు వల్లే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలైతే వచ్చాయని దాని వల్లే చాలా రోజులపాటు వీళ్లిద్దరు మాట్లాడుకోలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా ఇక్కడ ఒక హీరోతో సినిమా చేయాలనుకొని మరొక హీరోతో సినిమా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దానివల్ల దర్శకుల మీద గాని, ఆర్టిస్టుల మీద గాని కోపం రావడంలో తప్పేమీ లేదనే చెప్పాలి…ఇక నెల్సన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version